Site icon HashtagU Telugu

High Blood Pressure: హైపర్‌టెన్షన్.. క‌ళ్ల‌పై ప్ర‌భావం చూపుతుందా?

High Blood Pressure

High Blood Pressure

High Blood Pressure: హైపర్‌టెన్షన్ అంటే రక్తపోటు (High Blood Pressure) ఎల్లప్పుడూ అధికంగా ఉండటం. ఈ రోజుల్లో ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిలో కనిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గతంలో ఈ హై బీపీ సమస్య వృద్ధులలో, ఆ తర్వాత యువకులలో కనిపించేది. కానీ ఇప్పుడు పాఠశాల విద్యార్థుల్లో కూడా కనిపిస్తోంది. ఇది వారికి కూడా తీవ్రమైన సమస్యగా మారుతోంది.

ప్రతి సంవత్సరం హైపర్‌టెన్షన్ డేని మే 17న‌ ప్రత్యేక దినోత్సవం జరుపుకుంటారు. ఈ సారి హైపర్‌టెన్షన్ డే థీమ్: “హై బీపీని సరిగ్గా కొలవండి.. దాన్ని నియంత్రించండి.. ఎక్కువ కాలం జీవించండి.” హై బీపీ కళ్లపై కూడా కొంత ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పిల్లల కళ్లపై. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

హై బీపీ సమస్య ఎందుకు పెరుగుతోంది?

ఈ రోజుల్లో హై బ్లడ్ ప్రెషర్ సాధారణంగా మారింది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి. నేటి జీవనశైలి కారణంగా బీపీ సమస్య పెరగడం సాధార‌ణం. అంతేకాకుండా అధిక స్క్రీన్ టైమ్, ఊబకాయం, మానసిక ఆరోగ్యం కూడా దీనికి కారణాలు. తల్లిదండ్రులు తరచూ హై బీపీ పిల్లల కంటి ఆరోగ్యంపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోలేరు.

కళ్లపై ప్రభావం

హై బీపీ కారణంగా హైపర్‌టెన్సివ్ రెటినోపతి, రెటినల్ వీన్ అక్లూజన్, శాశ్వత దృష్టి నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు కళ్లలోని రెటినాలో వాపు ఏర్పడుతుంది. దీనివల్ల రెటినాలో రక్త ప్రవాహం, ప్రసరణ రెండూ నెమ్మదిస్తాయి.

నిపుణులు ఏమి చెబుతున్నారు?

వైద్య నిపుణుల‌ ప్రకారం.. పిల్లల కళ్ల రెగ్యులర్ చెకప్ చాలా అవసరం. ముఖ్యంగా కుటుంబంలో హై బీపీ చరిత్ర ఉంటే లేదా పిల్లలలో ఊబకాయం, ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే జాగ్ర‌త్త ప‌డాలి. చాలా సార్లు కళ్లలో ప్రారంభ సమస్యలు హై బీపీ వంటి మరో వ్యాధి వైపు సూచిస్తాయి. దీన్ని విస్మరించడం ప్రమాదకరం కావచ్చు.

Also Read: Gold Rate In India: నేటి బంగారం ధ‌ర‌లు ఇవే.. రూ. 35,500 త‌గ్గిన గోల్డ్ రేట్‌?

పిల్లలలో హై బీపీ సంకేతాలు

తల్లిదండ్రులు ఈ విషయాలు గమనించాలి

బీపీకి ఏదైనా చికిత్స ఉందా?

అయితే దీన్ని పూర్తిగా తొలగించే చికిత్స లేనప్పటికీ నియంత్రించడానికి జీవనశైలిలో మార్పులు, తీవ్ర‌మైన‌ సందర్భాల్లో డాక్టర్ నుంచి యాంటీహైపర్‌టెన్సివ్ మందులు తీసుకోవచ్చు.