Best Time To Wake Up: పొద్దున్నే నిద్ర లేవాలని ఇంట్లో పెద్దలు రోజూ సలహా ఇస్తుంటారు. పొద్దున్నే నిద్ర లేవడం వల్ల శరీరానికి, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. పొద్దున్నే నిద్ర లేవడం (Best Time To Wake Up) వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. ఉదయాన్నే నిద్ర లేవాలంటే రాత్రి సమయానికి నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. మీరు రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచినట్లయితే మీ రోగనిరోధక శక్తి క్షీణించవచ్చు. మనం ఉదయం ఏ సమయానికి నిద్ర లేవాలి..? రాత్రి ఎప్పుడు పడుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం.
నిద్ర లేవడానికి ఇవే సరైన సమయాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం 5 గంటలకు నిద్ర లేవడం ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. మీరు 5 గంటలకు మేల్కొనలేకపోతే 6 గంటలకు లేవటానికి ప్రయత్నించండి. ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. రాత్రి 8 నుండి 10 గంటల మధ్య నిద్రించడానికి ఉత్తమ సమయం. ఈలోపు నిద్రపోతే ఉదయం పూట పూర్తిగా ఫ్రెష్ గా అనిపిస్తుంది.
Also Read: Amrit Kalash Fixed Deposit: ఎస్బీఐలో అద్భుతమైన స్కీమ్.. కేవలం నాలుగు రోజులు మాత్రమే ఛాన్స్..!
మీరు ఆలస్యంగా మేల్కొంటే ఏమి జరుగుతుంది?
6 గంటల తర్వాత నిద్ర లేస్తే శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. దీని వల్ల ఉదయం పూట లభించే సహజసిద్ధమైన వనరులు లభించవు. ఉదయపు గాలి, సూర్యకాంతి రెండూ శరీరానికి మేలు చేస్తాయని చెబుతున్నారు.
మీరు ఎంతసేపు నిద్రించాలి?
పెద్దలకు నిద్ర సమయం కనీసం 7 గంటలు ఉండాలి. చిన్న పిల్లలు దాదాపు 8-9 గంటలు నిద్రపోవాల్సి ఉండగా, వృద్ధులు కనీసం 6 గంటలు నిద్రపోవాలి. ఇలాంటి వారి ఆరోగ్యానికి ఇంత నిద్ర సరిపోతుంది.
ఉదయాన్నే నిద్రలేవడం వల్ల కలిగే ప్రయోజనాలు
- ఉదయాన్నే నిద్రలేవడం ద్వారా మీరు సానుకూల అనుభూతి చెందుతారు.
- ఉదయాన్నే నిద్రలేవడం ద్వారా మీరు తాజా గాలిని ఆస్వాదించవచ్చు.
- పొద్దున్నే నిద్ర లేవడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది.
- ఉదయాన్నే నిద్రలేవడం వల్ల శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- ఉదయం నిద్రలేచిన తర్వాత శరీరంలో విటమిన్ డి లోపం ఉండదు.
- తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు దూరం అవుతాయి.