Tea or Coffee: టీ లేదా కాఫీ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో చాలామందికి ఉదయం లేచిన వెంటనే లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఒక కప్పు టీ లేదంటే కాపీ తాగిన తర్వాతనే వారి పనులను మొదలు పెడుత

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 07:40 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామందికి ఉదయం లేచిన వెంటనే లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఒక కప్పు టీ లేదంటే కాపీ తాగిన తర్వాతనే వారి పనులను మొదలు పెడుతూ ఉంటారు. ఒక్కరోజు కాఫీ, టీ లు తాగకపోయినా కూడా ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే టీ లేదా కాఫీ ని తాగడం వల్ల రిఫ్రెష్ గా అనిపించడంతో పాటు కాస్త ఎనర్జీ కూడా వస్తుంది. అందుకే ఆఫీసులలో ఉద్యోగాలు చేసేవారు రెండు మూడు గంటలకు ఒకసారి కాఫీ లేదా టీ ను తాగుతూ ఉంటారు. ఉదయం లేవగానే కాఫీ, టీ, గ్రీన్ టీ, పాలు, బూస్ట్ ఇలా ఒక్కొక్కరు వారికి ఇష్టమైనవి తాగుతూ ఉంటారు.

అయితే టీ లేదా కాఫీలలో ఏది మంచిది అంతే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతూ ఉంటారు. మరి టీ కాఫీలలో ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే మనలో ఎక్కువ శాతం మంది కాఫీల కంటే టీ లు ఎక్కువగా తాగుతున్నారు. ప్రతిరోజూ టీ తాగేవారిలో ఎముకలు బలంగా ఉంటాయి. ఇక బ్లాక్‌ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు. టీ ఎక్కువగా తాగితే కడుపులో అసిడిటీ పెరిగి అల్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. టీ ఎక్కువ సార్లు త్రాగే వారికి ఆకలి మందగిస్తుంది. ఎక్కువగా పనిభారంగా ఫీల్ అయ్యేవారు టీ తాగడం మంచిది. టీ తాగడం వలన శ‌రీరానికి ఉత్సాహం, ఉత్తేజం రెండు క‌లుగుతాయి.

ఇక డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు వీలైనంత వరకు కాఫీ తాగితే మంచిది. టీ, కాఫీల‌లో కెఫీన్ అనే స‌మ్మేళ‌నం అనేది కామన్ రెండిట్లో 400 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. ఇంతకు మించితే అనారోగ్య సమస్యలు వస్తాయి. మోతాదులో తీసుకుంటేనే మంచింది. టీ తో పోల్చితే కాఫీ చాలా ఎసిడిక్ గుణం కలిగి ఉంటుంది. కొవ్వును కరిగించే గుణాలు కాఫీలో ఎక్కువగా ఉంటాయి. రాత్రి పూట భోజనం మితంగా తీసుకుని ఒక కప్పు కాఫీ తాగితే జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు నడుము కూడా సన్నబడుతుంది. కాబట్టి టీ కాఫీ రెండు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ మోతాదుకు మించి తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు. అంతేకాకుండా కాఫీతో పోల్చుకుంటే టీ తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. కాఫీ టీ లో ఏది బెస్ట్ అంటే టీ బెస్ట్ అని చెప్పవచ్చు.