Site icon HashtagU Telugu

Winter Health Tips: కాఫీ లేదా టీ.. ఈ రెండింటిలో వింటర్ లో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

Winter Health Tips

Winter Health Tips

మనలో చాలామందికి టీ కాఫీ తాగి అలవాటు ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగనిది చాలామంది పనులు కూడా మొదలుపెట్టారు. కనీసం రోజులో ఒక్కసారైనా ఈ కాఫీ టీ తాగాల్సిందే. లేదంటే ఆ రోజంతా కూడా ఏదో కోల్పోయిన వారిలో ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం చలికాలం కావడంతో కనీసం రెండు మూడు సార్లు అయినా ఉండాల్సిందే. చల్లటి వాతావరణం లో వేడివేడిగా కాఫీ టీ తాగుతూ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే కాఫీ టీ రెండింటిలో చలికాలంలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏది తాగితే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చలికాలంలో టీ తాగడం వల్ల మన శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో అల్లం, తులసి, మిరియాలు, లవంగాలు కలిపిన టీ తాగవచ్చు. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఇది జలుబు వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. కాగా చలికాలంలో మసాలా టీ లేదా అల్లం టీ తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. -మూలికలు, గ్రీన్ టీ జీర్ణక్రియను మెరుగుపరిచే టప్ శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేయడంలో సహాయపడతాయని చెబుతున్నారు.

ఇకపోతే చలి కాలంలో కాఫీ తాగడం వల్ల కలిగే ఫలితాల విషయానికి వస్తే. కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది మిమ్మల్ని రిఫ్రెష్‌గా,ఎనర్జిటిక్‌ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. శీతాకాలపు నీరసాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని నమ్ముతారు. అయితే చలికాలంలో కాఫీ తాగడం వల్ల శరీరంలోని మెటబాలిజం పెరుగుతుందట. ఇది చల్లని వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుందట. ఏకాగ్రతను పెంచడంలో కాఫీ కూడా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లకు కాఫీ కూడా మంచి మూలం. కాబట్టి చలికాలంలో కాఫీ తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ఇంతకీ ఈ రెండింటిలో ఏది మంచిది? అన్న విషయానికొస్తే.. మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలనుకుంటే, శీతాకాలపు సాధారణ వ్యాధులను నివారించాలనుకుంటే టీ బెస్ట్ ఆప్షన్. చల్లని రోజుల్లో మాత్రమే హెర్బల్ టీ త్రాగడానికి ప్రయత్నించడం మంచిది. మరోవైపు మీకు శక్తి అవసరమైతే, పనిలో అప్రమత్తంగా ఉండాలనుకుంటే అప్పుడు కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.