Health Tips: టీ, బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త?

టీ.. ఇది కేవలం పానీయం మాత్రమే కాదు ఒక ఎమోషన్ అని చెప్పవచ్చు. ప్రతిరోజు కచ్చితంగా ఒక్కసారి అయినా కూడా టీ తాగాల్సిందే. లేదంటే ఏదో కోల్పోయినట్ట

Published By: HashtagU Telugu Desk
Health Tips

Health Tips

టీ.. ఇది కేవలం పానీయం మాత్రమే కాదు ఒక ఎమోషన్ అని చెప్పవచ్చు. ప్రతిరోజు కచ్చితంగా ఒక్కసారి అయినా కూడా టీ తాగాల్సిందే. లేదంటే ఏదో కోల్పోయినట్టు తలనొప్పిగా ఉందని చెబుతూ ఉంటారు. కొంతమంది ఉదయం సమయంలో టీ తాగితే మరి కొందరు మధ్యాహ్నం చాలామంది సాయంత్రం సమయంలో టీ ఉంటారు. టీతో పాటు కొంతమంది సమోసా తింటే మరికొందరు బిస్కెట్లు తింటూ ఉంటారు. టీ బిస్కెట్ కాంబినేషన్ ఎవరి గ్రీన్ అని చెప్పవచ్చు. టీ బిస్కెట్ కాంబినేషన్ ని చాలామంది ఇష్టపడతారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే టీతో పాటు బిస్కెట్ కలిపి తీసుకోవడం వల్ల అది అనేక రకాల సమస్యలకు దారితీస్తుందట.

మరి టీ బిస్కెట్ కలిపి తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టీతో పాటు బిస్కెట్లు తింటే బీపీ పెరుగతుందట, హైపర్‌టెన్షన్‌ సమస్య వచ్చే ముప్పు పెరుగుతుందట. డైటీషియన్‌ మన్‌ప్రీత్‌ అన్నారు. బిస్కెట్ లలో సోడియం కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది హైపర్‌టెన్షన్‌ ముప్పు పెంచుతుంది. గుండె సమస్యలు, గుండె పోటు రావడానికి హైపర్‌టెన్షన్‌ ప్రధాన కారణం.​ బిస్కెట్‌ తయారీకి చక్కెర ఎక్కువగా వాడుతుంటారు. టీలో కూడా చక్కెర ఉంటుంది. చక్కెర అధికంగా తీసుకుంటే ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలుగుతుంది. ఇది ఇన్సులిన్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా డయాబెటిస్‌ ముప్పును పెంచుతుంది. మరోవైపు, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు జీర్ణక్రియను పాడు చేస్తాయి.

ఇది మలబద్ధకానికి దారితీయవచ్చు. అలాగే టీ తాగేప్పుడు.. బిస్కెట్‌కు బదులుగా వేయించిన శనగలు తినొచ్చడని ‌డైటీషియన్‌ మన్‌ప్రీత్‌ అన్నారు. వేయించిన శనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఇన్సులిన్‌ను నియంత్రించి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగపరచే ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం, మెగ్నీషియం లభిస్తాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కోలిన్‌ని ఉంటుంది.

  Last Updated: 20 Jul 2023, 09:03 PM IST