Site icon HashtagU Telugu

Health Tips: భోజనం తిన్న తర్వాత టీ తాగుతున్నారా.. అయితే ఈ భయంకరమైన నిజాలు తెలుసుకోవాల్సిందే!

Health Tips

Health Tips

మామూలుగా చాలామందికి తిన్న తర్వాత టీ కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత టీ కాఫీలు తాగుతూ ఉంటారు. అయితే ఇలా తిన్న తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా తాగితే లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి భోజనం తిన్న తర్వాత టీ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు వస్తాయట.

టీలో కెఫిన్, టానిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను గణనీయంగా తగ్గిస్తాయట. భోజనం తరువాత కాఫీ, టీ తాగితే కడుపు నొప్పి, కడుపులో గ్యాస్ సులభంగా వస్తాయట. ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుందట. ఆ తరువాత ఏమీ తినాలని కూడా అనిపించదని చెబుతున్నారు. అలాగే శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందట. శరీరమంతా అలసట కమ్మినట్టు అనిపిస్తుందని, టీలో ఉండే టానిన్ శరీరంలో ఐరన్ ను శరీరం గ్రహించకుండా చేస్తుందని,దీని కారణంగా శరీరంలో ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఆహారం తిన్న తర్వాత వెంటనే టీ తాగే వారి దంతాలు దెబ్బతింటాయట. ఎందుకంటే టీలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది దంతక్షయానికి కారణం అవుతుందట. ఫలితంగా పంటి నొప్పి దుర్వాసన వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే ఆహారం తిన్న వెంటనే టీ తాగడం వల్ల నిద్ర లేమి వస్తుందట. రాత్రి భోజనం తర్వాత టీ తాగడం అస్సలు మంచిది కాదని, ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని చెబుతున్నారు..