Site icon HashtagU Telugu

‎Chamadhumpa: మీకు కూడా అలాంటి సమస్యలు ఉన్నాయా.. అయితే చామదుంపలు తినకపోవడమే మంచిది.. తిన్నారో!

Chamadhumpa

Chamadhumpa

Chamadhumpa: చామదుంపలు.. వీటిని కొందరు ఇష్టంగా తింటే మరికొందరు తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇవి తినడానికి రుచిగా ఉండి అనేక లాభాలను కలిగించినప్పటికీ కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. చామదుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలా ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. చామదుంపల్లో ఉండే స్టార్చ్, ఫైబర్ జీర్ణక్రియను కష్టతరం చేస్తాయట. వీటిని ఎక్కువగా తింటే పొట్ట ఉబ్బరం, గ్యాస్, భారంగా అనిపించవచ్చని చెబుతున్నారు.

‎ చామదుంపను సరిగ్గా ఉడికించకపోతే ఇది మలబద్ధకానికి కారణం అవుతుందట. దీని జిగట పేగులలో అడ్డంకులు ఏర్పడేలా చేస్తుందని, దీనివల్ల మలవిసర్జనలో ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. కొంతమందికి చామదుంప తిన్న తర్వాత వెంటనే చర్మంపై దురద, దద్దుర్లు లేదా మంట వంటి అలెర్జీలు రావచ్చు. ఇందులో ఉండే కాల్షియం ఆక్సలేట్ చర్మానికి చికాకు కలిగించవచ్చని చెబుతున్నారు. చామదుంపల్లో ఆక్సలేట్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది యూరిక్ ఆమ్లాన్ని పెంచి గౌట్ లేదా కీళ్ల నొప్పులను పెంచుతుంది.

‎ కీళ్ల సమస్యలు ఉన్నవారు దానిని తినకపోవడమే మంచిదట. చామదుంపల్లో కేలరీలు, కార్బోహైడ్రేట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ బరువు తగ్గాలనుకున్న వారు దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ బరువు మరింత పెరిగే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. చామదుంపల్లోని కాల్షియం ఆక్సలేట్ శరీరంలో చేరి కిడ్నీ స్టోన్లకు కారణం కావచ్చట. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా చామగడ్డల్లో ఫైబర్ ఉంటుంది. కానీ అధిక గ్లైసెమిక్ సూచిక కారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుందని, ఇది డయాబెటిక్ రోగులకు హానికరం కావచ్చని చెబుతున్నారు.

Exit mobile version