Site icon HashtagU Telugu

Smoke Biscuit Banned: స్మోక్ బిస్కెట్లపై నిషేధం…

Smoke Biscuit Banned

Smoke Biscuit Banned

Smoke Biscuit Banned: చెన్నైలో రెడీ-టు-ఈట్ స్మోక్ పిటా, స్మోక్ బిస్కెట్లు మరియు లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి వండిన ఆహారాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ఆహార భద్రత విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు పొగ బిస్కెట్లు తిని స్పృహ తప్పి పడిపోయాడు, అందుకు సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో ప్రజలలు పెద్ద సంఖ్యలో నైట్రోజన్ ఆహార ఉత్పత్తులను నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అయితే గత మూడు రోజులుగా చర్చనీయాంశంగా మారిన స్మోక్ బిస్కెట్లు, స్మోక్ పిటా వంటి లిక్విడ్ నైట్రోజన్ ఫుడ్ ఉత్పత్తుల వినియోగానికి ఇప్పుడు తెరపడింది.

We’re now on WhatsAppClick to Join

దీనికి సంబంధించి రాష్ట్ర ఆహార భద్రతా శాఖ లిక్విడ్ నైట్రోజన్ ఆహార ఉత్పత్తులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసి, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ద్రవ మరియు వాయు నైట్రోజన్‌ను ఫుడ్ ప్రాసెసింగ్ మరియు బేకింగ్ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించవచ్చని మరియు దాని కోసం ఆహార భద్రతా విభాగం నుండి అనుమతి తప్పనిసరిగా పొందాలని పేర్కొంది.

Also Read: Bumper Offer: ఉద్యోగుల‌కు బంప‌రాఫ‌ర్ ఇచ్చిన కంపెనీ.. పిల్ల‌ల చ‌దువుకు అయ్యే ఖ‌ర్చు కూడా ఇస్తుంద‌ట‌..!