Site icon HashtagU Telugu

Tamarind Seeds Water: చింత గింజల నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే?

Mixcollage 09 Feb 2024 08 49 Pm 2383

Mixcollage 09 Feb 2024 08 49 Pm 2383

మామూలుగా మనం చింతపండును ఉపయోగించిన తరువాత వాటి గింజలను పారేస్తూ ఉంటాం. చింత గింజలను ఎందుకు పనికిరావని పారేస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కేవలం చింతపండు వల్ల మాత్రమే కాకుండా చింత గింజల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చింతపండు గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చింత గింజలలో ఆరోగ్యానికి సంబంధించిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా కీళ్లనొప్పి ఎముకల నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ఈ చింత గింజల నీరు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

చింతపండులోని చింత గింజలు సేకరించి బాగా వేయించి నీటిలో వేసి రెండు రోజులు నానబెట్టి పిసికి పై పొట్టు తీసి పప్పును ఎండబెట్టాలి. తర్వాత వాటిని మెత్తగా దంచి పొడి చేసుకుని ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఒక చెంచా మోతాదుగా నీరు పోసి ఉడికిన తర్వాత పాలు పోసి చక్కర వేసి పాయసంలా చేసుకుని ఉదయం సాయంత్రం సేవించాలి. ఈ విధంగా కొద్దికాలం పాటు చేస్తుంటే కీళ్లు, మోకాళ్ళలో ఆరిగిపోయిన గుజ్జు తిరిగి మరలా ఏర్పడి యదా స్థితికి వస్తాయి. ఇది పెద్దగా ఖర్చు లేని కష్టం లేని సులభ మార్గం. ఈ సమస్య మొదలవుతున్నప్పుడే పై మార్గాన్ని అనుసరిస్తే ఆపరేషన్ కీళ్లలో రాడ్లు పెట్టించుకుని తర్వాత బాధపడే ప్రమాదం తప్పుతుంది.

చింతపండు గింజలు రసం పిత్త ఉత్పత్తిని పెంచడానికి సహజ నివారణగా ప్రసిద్ధి చెందింది. ఇది కొలెస్ట్రాల్లో మరింత తగ్గిస్తుంది. చింతపండు గింజలు చర్మాన్ని ఇన్ఫెక్షన్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. చింతపండు గింజలు ప్యాంక్రియాసిన్ రక్షిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పరిమాణాన్ని పెంచుతాయి. చింతపండు విత్తనాల్లో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటు హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుంది.