ఎక్కువ సమయం ఫోన్లలో మాట్లాడటం వలన రక్తపోటు పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. వారానికి అరగంట కంటే ఎక్కువ సమయం సెల్ ఫోన్లో మాట్లాడటం వలన హైపర్ టెన్షన్ లేదా అధికరక్తపోటుకి గురయ్యే అవకాశం ఉంటుందని యురోపియన్ హార్ట్ జర్నల్ డిజిటల్ హెల్త్ లో ప్రచురితమైన ఓ అధ్యయన ఫలితం పేర్కొంది. వారానికి అరగంట లేదా అంతకంటే ఎక్కువ సమయం సెల్ ఫోన్లో మాట్లాడటం వలన అధికరక్తపోటు ప్రమాదం 12శాతం పెరుగుతుందని ఈ అధ్యయనం చెబుతోంది.
ఎక్కువ సమయం ఫోన్ ని పట్టుకుని మాట్లాడటం వలన మెడ, భుజాలు, వెన్ను నొప్పులు పెరుగుతాయని, ఇవి కూడా అధిక రక్తపోటుకి దారి తీస్తాయని సదరు అధ్యయనం నిర్వహించిన నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం ఫోన్ తో ఉండటం వలన ఒత్తిడి పెరుగుతుందని ఆ విధంగా కూడా రక్తపోటు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫోన్ పట్టుకుని సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేవారిలో కూడా అనేక అనారోగ్యాలు పెరిగే ప్రమాదం ఉందని, వీరు అదేపనిగా కూర్చుని ఉండటం వలన చురుకుదనం, వ్యాయామం లోపించి అనారోగ్యాల బారిన పడే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: VietJet Passengers : 100 మంది..1 విమానం..12 గంటలు