Paracetamol Tablets : పారాసిటమాల్ ను ఇలా వేసుకుంటున్నారా ? కాలేయానికి ముప్పు తప్పదు..

పారాసిటమాల్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. జ్వరాన్ని త్వరగా తగ్గిస్తుందని వేసుకుంటారు. సాధారణంగా వాడితే హాని ఉండదు కానీ.. ఎక్కువగా వాడితే మాత్రం కాలేయానికి ముప్పు తప్పదు.

  • Written By:
  • Updated On - February 24, 2024 / 08:57 PM IST

Paracetamol Tablets : పారాసిటమాల్.. ఇది ప్రతి ఇంటిలోనూ కచ్చితంగా ఉంటుంది. ఒళ్లు నొప్పులుగా ఉన్నా.. కాస్త జ్వరంగా అనిపించినా.. వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ వేసేసుకుంటారు. ఇలా వెంటనే పారాసిటమాల్ వేసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువే. అయితే ఎప్పుడుపడితే అప్పుడు.. దీర్ఘకాలంపాటు పారాసిటమాల్ వేసుకుంటూ ఉంటే.. అది కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు వైద్యులు.

అమెరికాలో ఉన్న ఉటా విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు.. మానవ, ఎలుక కణజాలంపై పారాసిటమాల్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఇందులో పారాసిటమాల్ కాలేయంలో కణాల మధ్య ఉన్న నిర్మాణ సంబంధాలకు హాని కలిగిస్తుందని గుర్తించారు. దీనివల్ల కాలేయ ఆరోగ్యం పాడవుతుందని చెప్పారు. పారాసిటమాల్స్ ను మితంగా తీసుకుంటే ఫర్వాలేదు కానీ.. పెయిన్ కిల్లర్ అయిన పారాసిటమాల్ ఎక్కువసార్లు దీర్ఘకాలంపాటు తీసుకుంటే తీవ్రమైన కాలేయం వ్యాధులకు కారణం అవ్వొచ్చని చెబుతున్నారు.

పారాసిటమాల్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. జ్వరాన్ని త్వరగా తగ్గిస్తుందని వేసుకుంటారు. సాధారణంగా వాడితే హాని ఉండదు కానీ.. ఎక్కువగా వాడితే మాత్రం కాలేయానికి ముప్పు తప్పదు. శరీరంలో విచ్ఛిన్నమయ్యాక కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. అవే కాలేయానికి హాని చేస్తాయి. కాలేయంలో కణాలను ఇది నేరుగా దెబ్బతీస్తుంది. అందుకే వైద్యుల సూచన ప్రకారం మాత్రమే పారాసిటమాల్ మాత్రలను వాడటం మంచిది.

ఒకరోజులో మూడు కంటే.. ఎక్కువ పారాసిటమాల్ మాత్రలు వేయకూడదు. 24 గంటల్లో 8 కంటే ఎక్కువ పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటే మరీ ప్రమాదం. వికారం, కడుపునొప్పి, కామెర్లు వంటి సమస్యలొస్తాయి. ఊపిరి ఆడకపోవడం, అలసటగా ఉండటం, పెదవి నీలంరంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పారాసిటమాల్ వేసుకునే ముందు దాని ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవడం మంచిది. గడువు ముగిసిన ట్యాబెట్లను వాడటం కూడా ప్రమాదకరమే.

Also Read : Influenza : సీజనల్‌ వ్యాధులు విజృంభన..ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సూచన