ప్రతిరోజూ తీసుకునే ఆహారం విషయంలో ఒక్కోక్కరిది ఒక్కోలా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం ఏవో సమస్యలు వస్తుంటాయి. ఆహారం తీసుకోవాలని అనిపించకపోవడం, అసలు ఆకలి లేకపోవడం వంటి సమస్యల వల్ల తెలియకుండానే ఏదోకటి తినడం, తరచుగా ఆకలి వేయడం ఇలా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కానీ వీటిని ఈజీగా గుర్తించలేం. బరువు తగ్గడం అనారోగ్యం పాలవడం లేదా విపరీతంగా బరువు పెరగడం వంటి సమస్యలు వస్తుంటాయి.సరిగ్గా తిండి తినే అలవాటు లేనపట్లయితే మానసిక, శారీరక సమస్యలు ఈ రకమైన ఇబ్బందులకు దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని నిర్లక్ష్యం చేసినట్లయితే ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమని చెబుతున్నారు. ఆహారం తీసుకోవడం విషయంలో నిపుణులు చెబుతున్న సమస్యలేవో చూద్దాం.
1. అనొరెక్సియా నెర్వోసా
ఈ సమస్యతో బాధపడేవారు ఆహారం తింటేనే విరక్తి అన్నట్లుగా వ్యవహారిస్తుంటారు. ఆకలి వేసినా..వేయకున్నా..కడుపు మార్చుకుంటారు. దీంతో క్రమంగా విపరీతంగా బరువు తగ్గిపోతారు. శారీరకంగా బలహీనంగా మారిపోతారు.
2. బులీమియా నెర్వోసా
తరచూ ఎక్కువగా తినడం అలవాటు ఉండటం…లేదా తినాల్సి రావడం వల్ల…దానికి తగినట్లుగా శక్తిని తగ్గించుకోవాలన్న ఆలోచన నుంచి ఈ సమస్య తలెత్తుతుంది. దీంతో ఆహారం తిడనం తగ్గించుకోవడం, డైటింగ్ చేయడం, అతిగా వ్యాయామం చేయడం, బరువు తగ్గే మందులు వాడటం పెరుగుతుంది.
3. బింగే ఈటింగ్ డిజార్డర్
అతిగా ఆహారం తీసుకునే అలవాటు ఉండటం ఈ సమస్యకు దారితీస్తుంది. రెండు, మూడు గంటల్లోనే రెండుసార్ల కన్నా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం ఈ డిజార్డర్ కిందికి వస్తుంది. ఏదైనా సంఘటనతో అవమానంగా భావించి కుంగిపోయేవారు…మానసికస్థితిలో ఉన్నవారు ఈ సమస్యకు లోనవుతుంటారు. క్రమంగా బరువు పెరిగిపోతారు.
4. పికా
కొంతమంది చిత్రమైన మానసికసమస్య వల్లఎలాంటి పోషకాహార విలువలు లేని వాటిని తినేస్తుంటారు. మంచు, మట్టి, చాక్ పీసులు, సబ్బులు, పేపర్, వెంట్రుకలు, వస్త్రం ముక్కలు వంటివి తినడం పికా డిజార్డర్ కిందికి వస్తుంది. మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల అనారోగయ సమస్యలు వస్తుంటాయి.
5. రుమినేషన్ డిజార్డర్
ఈ రకమైన ఆరోగ్య సమస్య తలెత్తిన వారిలో తిన్న ఆహారం తిరిగి పైకి వస్తుంటుంది. దీంతో వారు ఆహారాన్ని మళ్లీ మింగేయడమో…బయటకు ఉమ్మేయడమో చేయాల్సి ఉంటుంది. దీంతో శరీరానికి సరిగ్గా ఆమారం అందక బలహీనంగా మారుతుంటారు.
6. అవాయిడెంట్
ఇదొక రకమైన సమస్య. బాధితులు కొన్ని రకాల ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. కొన్ని రకాల రంగులు, వాసన, రుచి ఉండే వాటికి దూరంగా ఉంటారు. అయితే ఇలాంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీంతో తినే ఆహారపదార్థాల సంఖ్య తగ్గిపోతుంది. శరీరానికి తగిన పోషకాలు అందవు. దీంతో బరువు తగ్గి, బలహీనంగా మారుతారు.
ఎలాంటి సమస్య అయినా ఆరోగ్యానికి ఇబ్బందే…
1. మనం రోజూ ఆహారం తీసుకోవడంలో డిజార్డర్ ఏదైనా సరే…బరువు తగ్గిపోవడంకానీ…బరువు పెరిగిపోవడం కానీ వచ్చి కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధకశక్తి తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవయవాలపైనా ప్రభావం పడి ప్రమాదక ర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంటుందంటున్నారు.
2. ఆహారం తీసుకోవడంలో సమస్యలు ఉన్నవారు విడిగా కానీ…వారి కుటుంబ సభ్యులత కలిసి మానసిక కౌన్సెలింగ్ ఇవ్వాలి.
3. ధ్యానం, యోగా వంటివి చేస్తే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.
4. తగిన ఆహారం అందనివారికి పోషకాహార నిపుణుల సలహాలతో తగిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు.