Site icon HashtagU Telugu

Kidney Failure: మూత్రపిండాల వైఫల్యం యొక్క లక్షణాలు

Kidney Failure

Kidney Failure

Kidney Failure: మానవశరీరంలో కిడ్నీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలోని వ్యర్ధాలను మూత్రం ద్వారా తొలగించడానికి కిడ్నీ సహాయపడుతుంది. శరీరం సజావుగా, ఆరోగ్యంగా పనిచేయాడంలో కిడ్నీ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కిడ్నీ పనితీరు తగ్గిపోయినప్పుడు శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అయితే కిడ్నీ పాడైనప్పుడు కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఆ లక్షణాలను గుర్తించి త్వరగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

మూత్రంలో రక్తం: మూత్రంలో రక్తం లేదా ఎరుపు రంగు మూత్రం వచ్చినప్పుడు అది మూత్రపిండ వ్యాధికి సంకేతం. మూత్రపిండాలలో రక్తస్రావం సంభవించిన్నప్పుడు లేదా మూత్ర నాళంలో గాయం, లేదా రక్తస్రావం జరిగితే కిడ్నీ సమస్య అని గుర్తించాలి.

నురుగుతో కూడిన మూత్రం: మూత్రపిండాలు ప్రభావితమయ్యాయనడానికి మొదటి సంకేతం మూత్రంలో మార్పు. మూత్రం నురగగా కనిపించినట్లయితే, మీ శరీరంలోని ప్రోటీన్ కూడా మూత్రంతో బయటకు వెళ్లిపోతుందని అర్థం. మూత్రం సాధారణంగా ప్రోటీన్ లేకుండా ఉంటుంది. మూత్రపిండాలు ప్రోటీన్‌ను సంశ్లేషణ చేయలేకపోతే, అది మూత్రంలో విసర్జించబడుతుంది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి సంకేతం.

మూత్రం రంగులో మార్పు: మూత్రం రంగులో ఆకస్మిక మార్పు శరీరంలో ఏదో సమస్య ఉందని సూచిస్తుంది. చాలా సార్లు మూత్రం రంగు మారడం కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని సంకేతం. ఉదాహరణకు మూత్రపిండాలు దెబ్బతిన్నట్లయితే మూత్రం సాధారణం కంటే ముదురు రంగులో ఉంటుంది. ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ రాళ్లను సూచిస్తుంది. .

మూత్రంలో దుర్వాసన: మూత్రంలో దుర్వాసన వస్తుంటే కిడ్నీలో ఏదో లోపం ఉందని సంకేతం. ఇది ఇన్ఫెక్షన్ కావచ్చు లేదా కిడ్నీలు విఫలమవుతున్నాయనడానికి సంకేతం కావచ్చు. అందుకే శరీరంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులను తెలుసుకుని అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

తరచుగా మూత్ర విసర్జన: కిడ్నీలు బలహీనంగా ఉన్నప్పుడు, తరచుగా మూత్ర విసర్జన చేయాలనే భావన ఉంటుంది. మూత్రపిండాలు ఎక్కువ కాలం మూత్రాన్ని నిల్వ చేయలేనందున వెంటనే మూత్ర విసర్జన చేయాలనే కోరిక ఏర్పడుతుంది. మూత్రపిండ వైఫల్యం యొక్క లక్షణాలలో ఒకటి తరచుగా మూత్రవిసర్జన చేయడం.

Also Read: Pawan Kalyan at Kothagudem : పరీక్ష పేపర్ లీక్స్ తో లక్షలమంది నిరుద్యోగులు నష్టపోయారు – పవన్ కళ్యాణ్