Site icon HashtagU Telugu

High Uric Acid: యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి? శ‌రీరంలో ఎలాంటి ఆరోగ్య స‌మస్య‌లు వ‌స్తాయి?

High Uric Acid

High Uric Acid

High Uric Acid: మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి (High Uric Acid) పెరిగినప్పుడు అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా చేతులు, కాళ్లు, కీళ్లలో నొప్పి, వాపు, గట్టిగా బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిపుణుల‌ ప్రకారం.. మన శరీరంలో ప్యూరిన్ అనే పదార్థం సరిగా జీర్ణం కానప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక మద్యపానం, నాన్-వెజ్ ఆహారం, చెడు ఆహారపు అలవాట్లు వంటి జీవనశైలి సమస్యల వల్ల వస్తుంది.

యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి?

యూరిక్ యాసిడ్ కీళ్లలో చిన్న చిన్న స్ఫటికాల రూపంలో పేరుకుపోతుంది. ఈ పరిస్థితి తీవ్రమైతే “గౌట్” అనే వ్యాధిగా మారుతుంది. గౌట్ వ్యాధిగ్రస్తులకు కీళ్లలో విపరీతమైన నొప్పి, వాపు సమస్యలు ఎదురవుతాయి. ఉదయం నిద్ర లేవగానే కాళ్ళు బిగుసుకుపోవడం లేదా నడవడానికి కష్టంగా ఉండటం యూరిక్ యాసిడ్ పెరిగిందనడానికి స్పష్టమైన సంకేతాలు. సకాలంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించకపోతే ఇది కిడ్నీ వ్యాధులకు కూడా దారితీస్తుంది.

Also Read: Asia Cup 2025: 9 మంది టీమిండియా స్టార్ క్రికెట‌ర్ల‌కు బిగ్ షాక్ త‌గ‌ల‌నుందా?

యూరిక్ యాసిడ్ పెరిగినట్లు తెలిపే లక్షణాలు

తీవ్రమైన నొప్పి: నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) అధ్యయనం ప్రకారం.. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కీళ్లలో ఆకస్మిక, తీవ్రమైన నొప్పి వస్తుంది. రాత్రి లేదా ఉదయం పూట శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నప్పుడు కూడా వాపు వస్తుంది.

వాపు- ఎరుపు రంగు: కీళ్ల చుట్టూ వాపు వచ్చి, చర్మం ఎర్రగా మారుతుంది. వేళ్ళను వంచడానికి ఇబ్బందిగా ఉంటుంది. కీళ్లపై చర్మాన్ని తాకితే వేడిగా అనిపిస్తుంది.

గట్టిదనం: నొప్పి, వాపుతో పాటు చర్మం గట్టిగా, గరుకుగా మారినట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు రాయడానికి కంప్యూటర్‌లో టైప్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది.

యూరిక్ యాసిడ్‌ల‌ను ఎలా నియంత్రించాలి?

యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.

ఆహారపు అలవాట్లు మార్చుకోవడం: పండ్లు, కూరగాయలు, తక్కువ ప్యూరిన్ ఉన్న ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్, అధిక నాన్-వెజ్, జంక్ ఫుడ్‌ను పూర్తిగా మానేయాలి.

వైద్య సలహా: యూరిక్ యాసిడ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు మందులు తీసుకోవడం మంచిది.

నీరు ఎక్కువగా తాగడం: శరీరంలో హైడ్రేషన్‌ను మెయింటైన్ చేయడం వల్ల యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు పోతుంది.

శారీరక శ్రమ: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. యూరిక్ యాసిడ్ సమస్యలు తగ్గుతాయి.