Site icon HashtagU Telugu

Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలేంటి..? గోల్డెన్ అవర్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి.. ?

brain stroke

Resizeimagesize (1280 X 720) (3) 11zon

హార్ట్ ఎటాక్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు కారణం అవుతున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke). ఇది వచ్చాక తొలి అర్ధ గంటలోగా చికిత్స పొందలేక ఏటా ఎంతోమంది చనిపోతున్నారు.  స్ట్రోక్ లేదా బ్రెయిన్ అటాక్ అనేది మెదడులోని రక్తనాళాలు ఆకస్మికంగా చీలిపోవడం లేదా అడ్డుకోవడం వల్ల సంభవించే వైద్య అత్యవసర పరిస్థితి. మెదడు కణజాలాలకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు.. అది తగినంత ఆక్సిజన్, పోషకాహారాన్ని అందుకోనప్పుడు.. దానిలోని కణజాలం చనిపోయి స్ట్రోక్‌కు దారి తీస్తుంది. హైపర్‌టెన్షన్, మధుమేహం, ఊబకాయం, ముదిరిపోతున్న వయస్సు , డైస్లిపిడెమియా వంటి వైద్యపరమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నవారు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతుంటారు. ఆల్కహాల్, పొగాకు లేదా ధూమపానానికి బానిసలైన వారు కూడా దీని బాధితులే. స్ట్రోక్‌ మరణాలను తగ్గించడానికి గోల్డెన్ అవర్ యొక్క ప్రాముఖ్యతను బాధితులకు తెలియజెప్పాలి.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్.. బ్రెయిన్ స్ట్రోక్ కు సంబంధించిన కొన్ని లక్షణాలను వివరించింది.అది బ్రెయిన్ స్ట్రోక్ ను నాలుగు అక్షరాల పదం FASTగా సరళీకరించింది. ఈ ఒక్కో పదానికి వివరణ, నిర్వచనం ఇచ్చింది.

F: ఫేషియల్ డ్రాపింగ్

ఒక వైపు ముఖం డ్రాప్ కావడం లేదా ఆకస్మిక అసమాన చిరునవ్వు అనేవి బ్రెయిన్ స్ట్రోక్‌కి సూచిక కావచ్చు.

A: చేయి బలహీనత

రెండు చేతులను నిటారుగా పట్టుకుని, వాటిని ఒకేసారి కిందకు వదలమని ఒక వ్యక్తిని అడగండి. ఒక చేయి నెమ్మదిగా క్రిందికి కూరుకుపోతుందా లేదా ఎత్తడం సాధ్యం కాలేదా అనేది చూడండి.

S: స్పీచ్ డిఫికల్టీ

ఎవరైనా అస్పష్టంగా లేదా గజిబిజిగా మాట్లాడుతుంటే బ్రెయిన్ స్ట్రోక్ లక్షణంగా అనుమానించాలి.మాట్లాడటం లేదా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉన్న.. నడుస్తున్నప్పుడు సమతుల్యతను కోల్పోవడం అనేవి కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.

T: సమయం

సరైన సమయంలో వైద్య సహాయం కోసం డాక్టర్ కు కాల్ చేయండి. లక్షణాలు కనిపించిన 4.5 గంటలలోపు ఆసుపత్రికి చేరుకోండి.

గోల్డెన్ అవర్ లోగా..

బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తించిన గోల్డెన్ అవర్ లోగా చికిత్స అందించాలి. గరిష్టంగా 4.5 గంటల విండో ఉంటుంది. రోగి ఈ గంటల్లోపు చికిత్స పొందినట్లయితే, అప్పుడు స్ట్రోక్ యొక్క సమస్యలు, తీవ్రతను తగ్గించవచ్చు. మెదడు యొక్క 24 7 CT స్కాన్ అందుబాటులో ఉన్న ఆసుపత్రికి రోగిని తీసుకెళ్లాలి.

CT స్కాన్ నివేదిక ఆధారంగా..

మెదడులో రక్తస్రావం సంకేతాలు ఉన్నాయని CT స్కాన్ నివేదికలో తేలితే గడ్డకట్టడాన్ని కరిగించడానికి క్లాట్-బస్టింగ్ ఔషధాన్ని ఉపయోగించవచ్చు. ఈ క్లాట్-బస్టర్ ఔషధాన్ని స్వీకరించే రోగులలో 30% మందిపై పెద్దగా ప్రభావం చూపదు. స్ట్రోక్ సిచ్యువేషన్ వారిలో మెరుగు పడదు.  ఒక న్యూరో రేడియాలజిస్ట్ మెదడు ధమనులను యాక్సెస్ చేయవచ్చు. చూషణ ప్రక్రియను ఉపయోగించి మెదడులో ఏర్పడిన రక్తం గడ్డను తొలగించవచ్చు. స్ట్రోక్ సంభవించిన తర్వాత 4.5 గంటల తర్వాత క్లాట్-బస్టింగ్ మందులు పనిచేయవని తెలుసుకోండి.