Site icon HashtagU Telugu

SwineFlu : తెలంగాణ‌లో `సైన్ ఫ్లూ` విజృంభ‌ణ‌

Swine Flu

Swine Flu

తెలంగాణ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మూడేళ్ల త‌రువాత తిరిగి ఎంట్రీ ఇచ్చిన ఈ వైర‌స్ కార‌ణంగా ఆస్ప‌త్రులు రోగుల‌తో నిండిపోతున్నాయి. వైర‌ల్ జ్వ‌రాలు క్ర‌మంగా పెరుగుతుండ‌డంతో వైద్య ఆరోగ్య‌శాఖ అప్రమ‌త్తం అయింది. తొలుత ఆగస్టు 13న ఆదిలాబాద్‌ జిల్లా రిమ్స్‌ నుంచి స్వైన్‌ ఫ్లూ సోకినట్లు ఐపీఎంలో నిర్ధారణ అయింది. ఆ జిల్లాలో జిల్లాలో హెచ్1ఎన్1 కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. తెలంగాణలో స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) కేసులు కనుగొన్నారు. క్ర‌మంగా కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గత రెండు వారాలుగా ఆసుపత్రుల్లో కేసుల పెరుగుదల నమోదైంది.

వైరస్ నమూనాలను నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM)కి పంపుతున్నారు. IPM డైరెక్టర్ డాక్టర్ సి. శివలీల మాట్లాడుతూ 2021 మరియు 2020లో ఎలాంటి నమూనాలు పంపలేదని, ఇప్పుడు నమూనాల సంఖ్య పెరుగుతుంద‌ని చెప్పారు. ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్‌కి హైదరాబాద్‌ నుంచి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నమూనాలు వస్తున్నాయని ఆమె చెప్పారు. గ్లోబల్ హాస్పిటల్‌లోని పల్మోనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ మాట్లాడుతూ ఆసుపత్రిలో 15 రోజులుగా హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. చాలా మంది రోగులు H1N1 విలక్షణమైన లక్షణాలతో ఉన్నార‌ని తెలిపారు. తలనొప్పి, దగ్గు, జలుబు, కడుపు నొప్పి, అతిసారం తదిత‌రాలు ఉన్నాయ‌ని వివ‌రించారు.

ఆసుపత్రిలో చేరిన రోగుల నమూనాలు మాత్రమే పరీక్ష కోసం IPMకి పంపబడతాయి. ఆసుపత్రిలో ప్రతిరోజూ సగటున ఐదు హెచ్‌1ఎన్‌1 కేసుల్లో మూడు వాస్తవ హెచ్‌1ఎన్‌1 కేసులు ఉన్నాయ‌ని డాక్టర్ తపస్వి తెలిపారు. “మేము ఎక్కువ పరీక్షలు చేస్తే, మేము మరిన్ని కేసులు నిర్థార‌ణ అవుతాయ‌ని అన్నారు. వర్షాకాలం, పాఠశాలలు తెరిచి ఉండంతో ప్రతి ఒక్కరికి దగ్గు లేదా జలుబు ఉంటుంది.