Site icon HashtagU Telugu

Health Tips: చిలగడదుంప – బంగాళదుంప.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది మీకు తెలుసా?

Mixcollage 24 Jan 2024 07 32 Pm 5910

Mixcollage 24 Jan 2024 07 32 Pm 5910

చిలగడదుంప, బంగాళదుంప ఇవి రెండూ కూడా దుంప జాతికి చెందినవే అన్న విషయం తెలిసిందే. ఈ రెండు ఒకే జాతికి చెందినవే అయినప్పటికీ రుచిలో మాత్రం రెండు వేరువేరుగా ఉంటాయి. బంగాళదుంపలో తీపి తక్కువగా ఉంటే, చిలగడదుంపలో తీపి ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్ పొటాటో అని కూడా అంటారు. ఇవి రెండింటితో కూడా చాలా రకాల స్నాక్స్, కూరలు తయారు చేసుకోవచ్చు. కానీ డయాబెటీస్, అర్థరైటీస్, ఊబకాయంతో ఉండేవారు బంగాళ దుంపను దూరం పెడతారు. అయితే చిలగడదుంప మాత్రం ఎవరైనా తినొచ్చని చెబుతారు. అయితే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది.

మరి ఈ విషయంపై నిపుణులు ఏం చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బంగాళదుపంలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. 100 గ్రాముల ఆలుగడ్డలో దాదాపు 130 కేలరీలు శక్తి వస్తుంది. కేలరీలు ఎక్కువగా కావాలి అనుకునేవారు ఆలు గడ్డ తినవచ్చు. అదే చిలగడ దుంపలో మాత్రం కేలరీలు కాస్త తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల చిలకడ దుంపలో 86 కేలరీల శక్తి మాత్రమే ఉంటుంది. కాబట్టి వెయిల్ లాస్ అవ్వాలి అనుకునేవారు స్వీట్ పొటాలో తీసుకోవచ్చు. పోషకాల విషయం వచ్చే సరికి బంగాళ దుంపలు, చిలకడ దుంపలు రెండూ కూడా సూక్ష్మ పోషకాలను అందిస్తాయి. ఆలుగడ్డలో విటమిన్లు సి, బీ6, పొటాషియం ఉంటాయి. చిలకడ దుంపల్లో మాత్రం విటమిన్లు ఏ, సీ, బీటా కెరోటిన్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి.

కాబట్టి శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో ఇవి రెండూ ముఖ్య పాత్రను పోషిస్తాయి. కాబట్టి పోషకాల లోపం ఉన్నవారు వీటిల్లో కావాల్సినది తినవచ్చు. అలాగే బంగాళ దుంపలతో పోల్చితే స్వీట్ పొటాటోలో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యలు, మల బద్ధకం, పొట్టకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడేవారు స్వీట్ పొటాలో తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. డయాబెటీస్‌తో బాధ పడేవారు ఆలుగడ్డని తినకపోవడమే మంచిది. ఆలుగడ్డ తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అయితే డయాబెటీస్ ఉన్నవారు స్వీట్ పొటాటోను తినవచ్చు.