Sweet Potato: చిలగడదుంప వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

మనలో చాలామంది చిలగడదుంప చాలా ఇష్టం. కొందరికి చిలగడదుంప అంటే అస్సలు ఇష్టం ఉండదు. చిలగడదుంప వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని, ఈ దుంపలు తింటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయని భావిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ దుంపల వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు. తియ్యగా ఉండే వీటిని కొందరు పచ్చివిగానే తినేస్తుంటారు. కొంతమంది ఉడకబెట్టి తింటారు. ఎక్కువ మంది సాయంత్రం వేళ స్నాక్ లా […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 11 Mar 2024 03 23 Pm 5847

Mixcollage 11 Mar 2024 03 23 Pm 5847

మనలో చాలామంది చిలగడదుంప చాలా ఇష్టం. కొందరికి చిలగడదుంప అంటే అస్సలు ఇష్టం ఉండదు. చిలగడదుంప వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని, ఈ దుంపలు తింటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయని భావిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ దుంపల వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు. తియ్యగా ఉండే వీటిని కొందరు పచ్చివిగానే తినేస్తుంటారు. కొంతమంది ఉడకబెట్టి తింటారు. ఎక్కువ మంది సాయంత్రం వేళ స్నాక్ లా తీసుకుంటారు.

అయితే ఈ దుంపల వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాలి. తొక్క తీసేసి, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి తింటే ఆ రుచే వేరు. ఇలా తినడంవల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు. వీటిలోని పండి పదార్థంవల్ల కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. వీటిల్లో కరిగేవి, కరగనివి రెండు రకాల ఫైబర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ను నియంత్రించడంతోపాటు దాన్ని బయటకు పంపించడంలో కూడా సాయపడుతుంది. కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దుంపలు తీసుకోవడంవల్ల కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

చిలకడదుంపలను తీసుకుంటే వాటిలో పొటాషియం ఉంటుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. హైబీపీకి కారణమయ్యే సోడియం చర్యను పొటాషియం నియంత్రిస్తుంది. ఈ దుంపలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బులతో బాధపడేవారు వారానికి ఒకసారైనా వీటిని తినాలి. రక్తనాళాలు దెబ్బతినకుండా నిరోధించే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలున్నాయి. ఆరెంజ్ కలర్ చిలకడ దుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది క్యారెట్‌లో కూడా ఉంటుంది. చిలకడ దుంపలు తినడం ఎంతో మంచిది. దీర్ఘకాలిక మంట వల్ల గుండె జబ్బులు వస్తాయి. చిలకడ దుంపల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. శరీరంలో మంట తగ్గడంతోపాటు ఛాతి దగ్గర వచ్చే మంట లాంటిది తగ్గుతుంది.

  Last Updated: 11 Mar 2024, 03:23 PM IST