ప్రస్తుతం చలికాలం మొదలయింది.. నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు మనకు ఈ చలి తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇలా చలికాలంలో ఏదైనా వేడివేడిగా చేసుకునే తినాలని చాలా రకాల కోరికలు కలుగుతూ ఉంటాయి. వాతావరణం చల్లగా ఉంది అంటే వేడివేడిగా చాయ్ లేదా పకోడీ,బజ్జీలు అలాగే మొక్కజొన్న వంటివి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇందులో స్వీట్ కార్న్ కూడా ఒకటి. క్లైమేట్ బాగా కూల్ గా ఉన్నప్పుడు వీటిని కాల్చుకొని లేదంటే ఉడకబెట్టుకుని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.
స్వీట్‌కార్న్‌లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
దీంతో పాటు బి విటమిన్స్ అయిన థయామిన్, నియాసిన్‌లు ఉంటాయి. వీటితో పాటు పాస్ఫరస్, మెగ్నీషియంలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వింటర్‌లో శరీరానికి మేలు చేస్తాయట. స్వీట్ కార్న్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్న సమస్యలు దూరమవుతాయట. అంతేకాకుండా మలబద్ధకం కూడా తగ్గుతుందట. కార్న్ తీసుకుంటే అందులోని ఫైబర్ కడుపు నిండుగా ఉండేలా చేస్తుందట. దీంతో బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు. ఈ స్వీట్ కార్న్ ఎముకలకు కూడా చాలా మంచిదట. మరి ముఖ్యంగా ఎదిగే పిల్లలు ఈ స్వీట్ కార్న్ తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. వృద్ధులు కూడా తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉండవట.
స్వీట్ కార్న్ తినడం వల్ల బరువు తగ్గుతారట. ఇందులోని ఫైబర్ ఎక్కువగా ఉండడం, కేలరీస్ తక్కువగా ఉండడం. ఈ కార్న్ తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. తినాలనిపించదు. దీంతో పాటు ఇందులో ప్రో బయోటిక్స్ ఉంటాయి. దీంతో మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారని చెబుతున్నారు. అలాగే చలికాలంలో వేడివేడిగా స్వీట్ కార్న్ తినడం వల్ల అది గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. స్వీట్ కార్న్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ స్వీట్ కార్న్ ని తినవచ్చు అని చెబుతున్నారు.