Sweet Corn: స్వీట్ కార్న్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

మొక్కజొన్న వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు అన్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు ఈ మొక్కజొన్నల

Published By: HashtagU Telugu Desk
Mixcollage 20 Mar 2024 07 40 Pm 8638

Mixcollage 20 Mar 2024 07 40 Pm 8638

మొక్కజొన్న వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు అన్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు ఈ మొక్కజొన్నల ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ఇదివరకటి రోజుల్లో మనకు మొక్కజొన్న కేవలం కొన్ని సీజన్ లలో మాత్రమే లభించేది. కానీ ప్రస్తుతం అన్ని సీజన్ లలో ఇవి మనకు లభిస్తున్నాయి. కాగా ఇందులో మాములు మొక్కజొన్నతో పాటు స్వీట్ కార్న్ కూడా లభిస్తూ ఉంటుంది. దీన్ని వంటల్లో కూడా ఉపయోగిస్తారు. వీటిని గింజలు వలిచి వేయించుకొని స్నాక్స్ రూపంలో కొందరు తీసుకుంటూ ఉంటారు.

దీన్ని తరుచుగా మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్వీట్ కార్న్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా తగ్గిస్తాయి. ఇందులో క్యాలరీలు, ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల తిన్నవెంటనే మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. స్వీట్ కార్న్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. లుటీన్, జియాజాంతిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి.

స్వీట్ కార్న్ ను తినడంవల్ల కళ్లకు మంచి ఆరోగ్యం. వయసు మీదపడటం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా ఉంటాయి. కంటిచూపు కూడా మెరుగవుతుంది. సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి. అలాగే ముఖంపై ముడతలు రావు. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంటారు. అనేక లాభాలను కలిగిస్తున్న స్వీట్ కార్న్ ను తినడం ఇప్పటినుంచే అలవాటు చేసుకోవాలి. ఇందులో ఉండే బీటా కెరోటిన్ శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఏ ను అందిస్తుంది. వ్యాధినిరోధకత పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు వివిధ రకాల ధాన్యాలతో పాటు మొక్కజొన్నను కూడా పరిమితంగానే తీసుకోవాలి. 100 గ్రాముల స్వీట్ కార్న్ లో 342 కేలరీలుంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి ఇది సహాయపడుతుంది.

  Last Updated: 20 Mar 2024, 07:41 PM IST