Site icon HashtagU Telugu

Mosquitoes Bite: షాకింగ్ రిపోర్ట్.. ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడ‌తాయి?

Mosquitoes

Mosquitoes

Mosquitoes Bite: ఏ సీజ‌న్‌లోనైనా దోమల భయం పెరుగుతుంది. కానీ కొంతమందిని దోమలు ఎక్కువగా కుడతాయని, మరికొంతమందిని అసలు కుట్టవని (Mosquitoes Bite) మీరు గమనించారా? ఇది నిజంగా జరుగుతుంది. కొంతమందికి దోమలు భయంకరంగా ఉన్నాయని అనిపించదు. అదే సమయంలో కొంతమంది ఒక్క దోమ కూడా వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టగలదు. ఈ రోజు మనం ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా దూరంగా ఉంటాయో, ఏ బ్లడ్ గ్రూప్ రక్తం దోమలకు రసగుల్లా కంటే తియ్యగా ఉంటుందో తెలుసుకుందాం. దీని వెనుక కారణాలను కూడా చూద్దాం.

ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడ‌తాయి?

హెల్త్‌లైన్ రిపోర్ట్ ప్రకారం.. కొన్ని బ్లడ్ గ్రూప్‌లు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ముఖ్యంగా O బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడ‌తాయి. ఈ బ్లడ్ గ్రూప్ వారు ఎక్కడ కూర్చున్నా దోమలు వారిని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. దోమ కాటు వేసిన‌ ప్రదేశంలో ఎరుపు గుర్తులు ఏర్పడతాయి. ఈ గ్రూప్ ఉన్న‌వారు దోమల నుండి రక్షణ కోసం యాంటీ-మాస్క్విటో లోషన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి

ఇంకా కొన్ని కారణాల వల్ల కూడా దోమలు ఎక్కువగా కుడ‌తాయి. నిజానికి దోమలు మనిషి శరీరం నుండి వెలువడే వాసన, కార్బన్ డై ఆక్సైడ్, చర్మ రసాయనాలను గుర్తించి బాధితుడిని ఎంచుకుంటాయి. O గ్రూప్ వారి శరీరం నుండి వెలువడే రసాయనాలు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. రెండవ స్థానంలో B బ్లడ్ గ్రూప్ వారు ఉన్నారు. వీరిని కూడా దోమలు ఎక్కువగా కుడ‌తాయి.

Also Read: Hardik Pandya: ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులో క‌ల‌క‌లం.. కోచ్ జ‌య‌వ‌ర్ధ‌నేతో పాండ్యా గొడ‌వ, వీడియో ఇదే!

ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు కుట్టవు?

కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్న‌వారిని దోమలు చాలా తక్కువగా కుడ‌తాయి. మీ బ్లడ్ గ్రూప్ A అయితే మీరు కొంచెం ‘అదృష్టవంతులు’ అని అనుకోవాల్సిందే. నిజానికి ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని దోమలు చాలా తక్కువగా కుడ‌తాయి. అయితే దోమలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్ల‌డ్ గ్రూప్ వారిపై కూడా కొంచెం దాడి జరుగుతుంది. కానీ ఇతరులతో పోలిస్తే వీరిని దోమలు తక్కువగానే కుడ‌తాయి.