Site icon HashtagU Telugu

Meat: మాంసం ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు?

Meat

Meat

మనలో చాలామందికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. వారంలో కనీసం నాలుగైదు సార్లు అయినా మాంసం తింటూ ఉంటారు. మరికొందరు రోజు మాంసం తింటూ ఉంటారు. అయితే మాంసం తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ అలా అని ఎక్కువగా ఉంటే మాత్రం సమస్యలు తప్పవట. అయితే మాంసాహారం తింటే కొన్ని రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి మాంసం తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిజానికి మాంసాహారం తినడం వల్ల శరీరానికి చాలా పోషకాలు లభిస్తాయట.

ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్ లు రోగ నిరోధక వ్యవస్థని బలపరుస్తాయని చెబుతున్నారు. అలానే అతిగా మాంసాహారం తినడం వల్ల శరీరం వ్యాధులకి నిలయంగా మారుతుందని చెబుతున్నారు. మాంసాహారం వల్లే ఎక్కువ మందికి క్యాన్సర్, గుండె జబ్బులు వస్తున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైనట్లు. అలాగే మాంసాహారం ఎక్కువగా తినే వారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతోందట. కొలెస్ట్రాల్ పెరిగింది అంటే గుండె జబ్బుకి అతి సమీపంలో ఉన్నారని అర్థం అని చెబుతున్నారు. అలాగే మాంసాహారాన్ని ప్రతిరోజు తీసుకున్నవారు. బరువు త్వరగా పెరుగుతారని డాక్టర్లు ఎప్పటినుంచో చెపుతున్న వాస్తవం.

అలాంటి వాళ్ళు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వలన మాంసాహారం తినడం వల్ల వచ్చే పోషకాలు లభిస్తాయట. అదే సమయంలో బరువుని కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే మాంసం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు పేగుల పనితీరుపై చెడు ప్రభావం చూపిస్తుందట. ప్రాసెస్ చేసిన మాంసం చాలా ప్రమాదం దీనివల్ల ఆ పొట్టకు సంబంధించిన అనేక వ్యాధులు మనల్ని పట్టిపీడిస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాగే ఎక్కువ మాంసాహారం తింటే ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్నట్లే దీనివలన మలబద్ధకం వస్తుందట. ఎందుకంటే మాంసంలో కరిగే ఫైబర్ ఉండదు. కాబట్టి జీర్ణవ్యవస్థ కదలకుండా మలబద్ధకానికి కారణం అవుతుంది. కాబట్టి మాంసాహారాన్ని తీసుకోవద్దు అనట్లేదు కానీ పరిమితిలో మాత్రమే తీసుకోమని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు.