కాకరకాయ.. ఈ పేరు వినగానే చాలామంది అమ్మో కాకరకాయ అని భయపడుతూ ఉంటారు. కొందరు కాకరకాయను తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ కొంతమంది మాత్రం కాకరకాయ కూరను లొట్టలు వేసుకొని మరీ తింటూ ఉంటారు. కాకరకాయ వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే. కానీ కాకరకాయ చేదుగా ఉండడం చాలా మంది తినడానికి ఇష్టపడరు. కాకరకాయ చేదుగా ఉన్నప్పటికి దీనిలో కొలెస్టాల్ శాతం తక్కువ. దీనిలో మినరల్స్ ,ఐరన్, మేగ్నిషియం, విటమిన్స్ ఉంటాయి. థయామిన్ , రెబోఫ్లేవిన్ , ఫాంథోనిక్ యాసిడ్, ఐరన్, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి.
కాకరకాయ డయాబెటిస్ పెషెంట్ లకు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. బీపిని కంట్రోల్ చేస్తుంది. చెడు కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, అస్తమా వంటి వ్యాధులను కూడా తగ్గిస్తుంది. గుండె జబ్బులను కూడా నయం చేస్తుంది. క్యాన్సర్ లివర్ కిడ్ని సమస్యలు రాకుండా నివారిస్తుంది. అయితే కాకర కాయను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ద్వారా చక్కని ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్ లో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. కాకరకాయను కూరలానే కాకుండా జ్యూస్ ల తీసుకోవటం ద్వారా అధిక ప్రయోజనాలు పొందవచ్చు.
కాకరకాయ కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదర సంబందింత సమస్యలను తగ్గిస్తుంది. ఇది జీర్ణ శక్తిని వృద్దిచేస్తుంది. ఇందులోని చేదుగుణం తరుచుగా తీసుకోవటం ద్వారా రక్తం శుద్ధి అవుతుంది. హైపర్ టెన్ష్నన్ ని అదుపులో ఉంచుకోవచ్చును. చర్మం ముఖ్యంగా చర్మ వ్యాధులకు సోరియాసిన్ వంటి వాటికి కాకర కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చును.