Curd: ప్రతిరోజు పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?

మాములుగా పాలు పాల పదార్థాలు అయిన పెరుగు, మజ్జిగ లాంటి వాటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. చాలామం

  • Written By:
  • Updated On - February 19, 2024 / 09:36 PM IST

మాములుగా పాలు పాల పదార్థాలు అయిన పెరుగు, మజ్జిగ లాంటి వాటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. చాలామందికి అన్నం తినేటప్పుడు మజ్జిగ, లేదా పెరుగు లేకుండా తినడం కంప్లీట్ అవ్వదు. అయితే ఈ మజ్జిగ, పెరుగు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు మజ్జిగ తింటే మరికొందరు పెరుగు తింటూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పెరుగు మజ్జిగ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినని వారు సైతం తినడం మొదలు పెడతారు. మరి మజ్జిగ పెరుగు వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే..

ఆరోగ్యంగా పెరుగు బలంగా ఉండేలా చేస్తుంది. కొవ్వు మరియు కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు అదుపులో ఉండటానికి సహాయం చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు ఒక మంచి ఆహారం చెప్పవచ్చు. ఆందోళనతో పోరాట చేస్తుంది. మెదడుకు విశ్రాంతి మరియు భావోద్వేగ సమ్మతిను అందించి ప్రశాంతతను కలిగిస్తుంది. అంతేకాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఆకలి లేని వారు పెరుగులో చక్కెర లేదా ఉప్పు కలిపి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. పెరుగులో ఉండే లాక్టోబర్ అనే బ్యాక్టీరియా శరీరంలో చల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది.

కడుపులో అల్సర్ ఉండేవారికి గ్యాస్టిక్ ఇరిగేషన్ తో బాధపడే వారికి హైపర్ ఎసిడిటీతో బాధపడే వారికి పెరుగు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. నిద్ర పట్టడడానికి కూడా పెరుగు బాగా హెల్ప్ చేస్తుంది. ఆయుర్వేదంలో నిద్ర పట్టని వారిని పెరుగు వాడమని ఎక్కువగా సూచిస్తూ ఉంటారు. ఒక కప్పు పెరుగు తింటే నిద్ర బాగా పడుతుంది.