Site icon HashtagU Telugu

‎Banana: ప్రతిరోజు రెండు అరటి పండ్లు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Banana

Banana

‎Banana: అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని రకాల సీజన్లలో తక్కువ ధరకే లభించే పండ్లలో అరటిపండు మొదటి స్థానంలో ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ అరటి పండ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. కాగా ప్రతిరోజు అరటి పండ్లు తీసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు రెండు అరటి పండ్లు తీసుకోవడం వల్ల చాలా లాభాలు కలుగుతాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‎ అరటిపండ్లు తక్షణ శక్తిని అందించడంలో బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే సహజ చక్కెరలు, ఫైబర్, శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందిస్తాయట. దాంతో అలసటను తగ్గిస్తాయని, అందుకే జిమ్‌ కు వెళ్లేవారు, అథ్లెట్లు వ్యాయామానికి ముందు, తర్వాత వీటిని తీసుకోవడానికి ఇష్టపడతారట. రోజుకు రెండు అరటిపండ్లు తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుందట. అరటిపండ్లలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఇది రక్తపోటును నియంత్రించి, గుండెపోటు, ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. వీటిలోని అధిక ఫైబర్ కంటెంట్ ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుందట. ఇది మలబద్ధకం సమస్యను సమర్థవంతంగా తగ్గిస్తుందని చెబుతున్నారు. అరటిపండ్లు కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా మేలు చేస్తాయట. అరటిపండ్లలోని ట్రిప్టోఫాన్ అనే పదార్థం మంచి అనుభూతిని కలిగించే హార్మోన్‌ ను ఉత్పత్తి చేస్తుందట.

‎ ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని, శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత సమస్య ఉన్నవారికి అరటిపండ్లు చాలా మంచివని చెబుతున్నారు. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయట. అరటిపండ్లు కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా మేలు చేస్తాయట. అరటిపండ్లలోని ట్రిప్టోఫాన్ అనే పదార్థం మంచి అనుభూతిని కలిగించే హార్మోన్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందట. శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత సమస్య ఉన్నవారికి అరటిపండ్లు చాలా మంచివట. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని చెబుతున్నారు.

‎విటమిన్ బి6, విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఇది జలుబు, ఫ్లూ వంటి కాలానుగుణ వ్యాధుల నుండి రక్షణ ఇస్తుందట. అదేవిధంగా అరటిపండ్లలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచి, ముడతలను తగ్గిస్తాయని, అలాగే బయోటిన్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా అరటిపండ్లు గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచివట. వీటిలోని విటమిన్ బి6, పొటాషియం, ఐరన్ వారి ఆరోగ్యానికి అవసరం, ముఖ్యంగా మార్నింగ్ సిక్నెస్ తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. కాబట్టి ప్రతీ రోజు తప్పకుండా రెండు అరటిపండ్లను తినాలి అని చెబుతున్నారు.

Exit mobile version