Site icon HashtagU Telugu

Kidney Stones: ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలు కిడ్నీలో స్టోన్స్ ఇట్టే కరిగిపోవడం ఖాయం!

Kidney Stones

Kidney Stones

ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత రోజుల్లో ప్రతి వంద మందిలో 20 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య అంత పెరుగుతూనే ఉంది. అయితే కిడ్నీలు రాళ్లు ఏర్పడడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కిడ్నీలో రాళ్లు కరిగించుకోవడానికి కూడా అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు హోమ్ రెమిడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం వల్ల విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. దీంతో ఏం పని చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.

మరి కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గాలంటే ఏం చేయాలో, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెరుగు, కేఫీర్ వంటి పులియబెట్టిన ఆహారాలు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో సహాయపడతాయి. ఈ ఆహారాలను మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి ఎంతగానో సహాయపడతాయని చెబుతున్నారు. పసుపు ఎన్నో ఔషధ గుణాలున్న పదార్థం. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుందట. మూత్ర పిండాల్లో రాళ్లను కరిగించడానికి కూడా ఇది సహాయపడుతుందట. ఇందుకోసం పసుపును టీ, సూప్, పులుసు, డిటాక్స్ వాటర్ రూపంలో తీసుకోవచ్చు. పసుపు మన మూత్రపిండాలను శుభ్రపరచడానికి, విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుందట. అలాగే దీనిలో ఉండే కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రాళ్లు ఏర్పడకుండా కాపాడుతాయని చెబుతున్నారు.

కాగా సిట్రస్ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లను రోజూ తినాలి. ఈ పండ్లు మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కూడా సహాయపడుతుందట. దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రాళ్లను నివారిస్తాయని చెబుతున్నారు. అలాగే అల్లంలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. అల్లం మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి కూడా సహాయపడుతుందట. ఇందుకోసం అల్లం టీ, లేదా డిటాక్స్ వాటర్, స్మూతీలను తాగడం మంచిదని చెబుతున్నారు. ఇది మంటను తగ్గించడానికి, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గించడానికి సహాయపడుతుందట. సెలెరీలో సహజ లక్షణాలు ఉంటాయి.

ఇవి శరీరంలో నీరు పేరుకుపోనివ్వవు. అలాగే మూత్రం ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అంతేకాదు ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని, విష పదార్థాలు కూడా బయటకు పోతాయని చెబుతున్నారు . కీరదోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ మూత్రం ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుందట. అలాగే పోషకాలు పుష్కలంగా ఉంటే ఆపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. ఆపిల్స్ డైటరీ ఫైబర్ కు మంచి మూలం. ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూడటానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే దానిమ్మ రసం కూడా కిడ్నీలో రాళ్లు తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

note: పైన ఆరోగ్య సమాచారం విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్న వెంటనే వైద్యులు సలహా తీసుకోవడం మంచిది.