పానీ పూరి.. ఈ రెసిపీ పేరు చెబితే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పానీపూరి ఇష్టపడి తింటూ ఉంటారు. సాయంత్రం అయ్యింది అంటే చాలు రోడ్డు సైడ్ పానీపూరి బండి వద్ద క్యూ కడుతూ ఉంటారు. బయట తినడానికి ఇష్టపడని వారు కొంతమంది ఇంట్లోనే పని చేసుకుని తింటూ ఉంటారు. అయితే పానీపూరి వల్ల కేవలం నష్టాలు మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు లాభాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. పానీ పూరి వల్ల లాభాలా అని ఆశ్చర్య పోతున్నారా! మరి పానీ పూరి వల్ల కలిగే ఆ లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పానీపూరి తినడం వల్ల జీర్ణక్రియకు చాలా మేలు జరుగుతుందట. పానీపూరీలో పుదీనా, జీలకర్ర వంటివి వినియోగిస్తుంటారు. ఇవి జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయట. పానీపూరి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి తిన్న ఆహరం జీర్ణం అవుతుందని చెబుతున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలిగిపోతాయట. శరీరానికి శక్తి తక్షణమే శక్తి కావాలని అనుకునే వారు పానీపూరి తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చట. పానీపూరీలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయట. పానీపూరీలో కేవలం కార్బోహైడ్రేడ్లు మాత్రమే కాకుండా విటమిన్స్ కూడా ఉంటాయి. పానీపూరీలో బంగాళాదుంపలు, శనగలు వంటివి కూడా వినియోగిస్తారు.
కాబట్టి వీటిలో విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన విటమిన్స్ ను అందిస్తాయట. చాలా మందికి నోటి పూత వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తులు పానీపూరి తినడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చట. పానీపూరీ లో నోటిపూతను తగ్గించే కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే పానీపూరి తింటే నోటిపూత నుంచి ఉపశమనం లభిస్తుందట. పానీపూరీలో ఉండే పుదీనా, జీలకర్ర వంటివి మనసును రెఫ్రెషింగ్ గా చేస్తాయట..దీని వల్ల మనస్సు ఉత్తేజంగా మారుతుందట. ఏ పనినైనా ప్రశాంతంగా చేసుకోగలుగుతారని,మంచి ప్రొడక్టివిటీని అందించగలుగుతారని చెబుతున్నారు..