Healthy Lungs: ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఈ ఆహారం తీసుకోవాల్సిందే?

మానవ శరీరంలోని ఊపిరితిత్తులు బలహీనపడడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అటువంటి వాటిలో వాయు

  • Written By:
  • Publish Date - August 11, 2022 / 08:30 AM IST

మానవ శరీరంలోని ఊపిరితిత్తులు బలహీనపడడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అటువంటి వాటిలో వాయు కాలుష్యం, అలర్జీ కారకాలు, తగ్గిన శారీరక కదలికలు, పోషకాహర లోపం. కాగా ప్రస్తుత సమాజంలో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ గనణీయంగా పెరుగుతోంది. అయితే పొగతాగే అలవాటు, పర్యావరణ విష వాయువులు, శరీరంలో వాపునకు కారణం అయ్యే ఆహారం తీసుకోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఆస్తమా, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ , పల్మనరీ ఫైబ్రోసిస్, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆహార పరంగా మార్పులు చేసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గుమ్మడి: గుమ్మడికాయలో కెరటోనాయిడ్స్ అయిన కెరోటిన్, లూటిన్, జియాక్సాంతానిన్ ఉంటాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్ గా, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలుగా పనిచేస్తాయి. రక్తంలో కెరటోనాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

పసుపు: పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుందని వినే ఉంటారు. ఇది అక్షరాలా నిజం. ఆధునిక వైద్య శాస్త్రం సైతం పసుపులోని ఆరోగ్య గుణాలను గుర్తించింది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గా పనిచేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అన్నది అత్యంత కీలకమైన ఔషధ పదార్థం.

బ్లూ బెర్రీలు: పోషకాల గని బ్లూబెర్రీ పండ్లు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తాయి. మాల్విడిన్, సియానిడిన్, పియోనిడిన్, డెల్ఫినిడిన్, పెటూనిడిన్ అనే యాంథోసియానిన్స్ ఇవి ఊపిరితిత్తుల కణజాలాన్ని కాపాడతాయి.

గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఎపిగాలోకాచెటిన్ గాలేట్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా, యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఫైబ్రోసిస్ ను నివారిస్తుంది.

యాపిల్: వారంలో ఐదు లేదా అంతకు మించి యాపిల్ పండ్లను తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు గుర్తించాయి.

ఆలివ్ ఆయిల్: ఆలీవ్ ఆయిల్ ను తీసుకోవడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఆలివ్ ఆయిల్ లో ఎక్కువగా ఉంటాయి.

బార్లీ : బార్లీలో పోషకాలు ఎక్కువ. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడేందుకు ఈ పోషకాలు సాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్ అయిన ఫ్లావనాయిడ్స్, విటమిన్ ఈ ఇందులో ఉంటాయి.