Site icon HashtagU Telugu

Sunflower Seeds: బరువును తగ్గించి డయాబెటిస్ లో నియంత్రణలో ఉంచే గింజలు?

Sunflower Seeds

Sunflower Seeds

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. దీంతో చాలా లావు ఉన్నవారు బరువు తగ్గడం కోసం అనేక రకాల టిప్స్ ని ఫాలో అవుతున్నారు. కొంతమంది లావు తగ్గడానికి తినకుండా డైటింగ్ చేస్తుంటే, మరి కొంతమంది ఎక్సర్ సైజు లు, వ్యాయామాలు చేసి,జిమ్ములకు వెళ్లి వారి బాడీని తగ్గించుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ రిజల్ట్ కనిపించకపోయేసరికి చాలామంది నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు.

లావు తగ్గడం కోసం కొంతమంది ఆహారం తినడం మానేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే అలా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి ప్రొద్దుతిరుగుడు పువ్వు గింజలు ఒక చక్కటి ఔషధంలా పనిచేస్తాయి. అయితే బరువు తగ్గాలి అనుకున్న వారు వద్దు ప్రొద్దు తిరుగుడు విత్తనాలు వీటినే కుసాలు అని కూడా పిలుస్తూ ఉంటారు.. ప్రొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విత్తనాలు ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉండి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

పొద్దుతిరుగుడు పువ్వులను రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ గింజలు శరీరంలో ఉండే టాక్సిన్స్ ను తొలగిస్తాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని అదనపు కొవ్వను కూడా వేగంగా కరిగిస్తాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్స్ ను తొలగిస్తాయి. అంతేకాదు ఇవి శరీరంలోని అదనపు కొవ్వను వేగంగా కరిగిస్తాయి. మధుమేహం లేదా డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ ప్రొద్దుతిరుగుడు విత్తనాలను తినవచ్చు. డయాబెటీస్ పేషెంట్లకు పొద్దుతిరుగుడు విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.