వేసవి కాలం వచ్చింది అంటే చాలా హార పదార్థాల కంటే ఎక్కువగా ద్రవపదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా మండే ఎండల్లో చాలా చల్లగా ఉండే ద్రవపదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చల్లగా ఉండడం కోసం ఐస్ క్యూబ్స్ ఐస్ వేసిన జ్యూస్లు తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఐస్ వేసిన జ్యూస్ లు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా మంచినీళ్లతో ఇంట్లో తయారు చేసుకునే ఐస్ క్యూబ్స్ బాగానే ఉంటాయి. కానీ బయట జ్యూస్ పాయింట్ల వద్ద దొరికే రా ఐస్ మాత్రం అనేక ఆరోగ్య ప్రమాదాలకు కారణమని చెబుతున్నారు. దీనిని శుభ్రమైన నీళ్లతో తయారు చేయకపోవడం వల్ల, వీటిలో కలుషితాలు, మలినాలు ఉండే అవకాశం ఉంటుందట. అలాగే రా ఐస్ లో హానికరమైన బ్యాక్టీరియా ఉండడంవల్ల ఇది అనేక రోగాలకు కారణమవుతుందట. రా ఐస్ లో నోరో వైరస్, ఈకోలీ వంటి బ్యాక్టీరియా ఉంటాయట. ఇవి వ్యాధి కారకాలుగా చెప్పవచ్చు. అయితే ఈ రా ఐస్ తో తయారు చేసిన జ్యూసులు తాగినప్పుడు జీర్ణ సంబంధితమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. వీటితో గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందట.
వాంతులు,విరోచనాలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు కూడా రావచ్చని చెబుతున్నారు. అదేవిధంగా ఆస్తమా, బ్రాంకైటిస్, సైనస్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ రా ఐస్ తో తయారు చేసినటువంటి జ్యూసులు తాగకూడదుట. మండే ఎండల్లో తీవ్రమైన దాహంతో ఉన్నవాళ్లు జ్యూస్ పాయింట్స్ వద్దకు వెళ్లి చల్ల చల్లగా వేసిన ఐస్ తో ఉన్న జ్యూస్లను ఒకటికి రెండు గ్లాసులు తాగుతూ ఉంటారు. కానీ ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందట. కాబట్టి సాధ్యమైనంత వరకు బయట జ్యూస్ లు తాగకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. ఒక జ్యూస్ లు మాత్రమే కాదు బయట రా ఐస్ తో తయారు చేసిన ఏ పానీయాలను తాగకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.