Site icon HashtagU Telugu

Weight Loss: సమ్మర్ లో బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ డ్రింక్స్ తాగాల్సిందే!

Weight Loss

Weight Loss

ఇటీవల కాలంలో బరువు తగ్గడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. బరువు తగ్గడం కోసం పడే ఇబ్బందులు గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. డైట్లు ఫాలో అవ్వడం జిమ్ కి వెళ్లడం వ్యాయామలు చేయడం వాకింగ్ చేయడం ఎలా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అయినప్పటికీ బరువు తగ్గక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వేసవికాలంలో ఆహారానికి బదులుగా ఎక్కువగా పానీయాలు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ ఎండలకు ఎక్కువసేపు ఏదో ఒకటి తాగుతూ ఉండాలి అనిపిస్తుంది.

మరి ఇలా తాగాలి అన్నప్పుడే కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల మనం వేసవికాలం ఈజీగా బరువు తగ్గవచ్చట. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్యాలరీలు తక్కువగా ఉన్న కొబ్బరి నీళ్లు వేసవికాలం ఎంతో మంచిదట. చూడడానికి నీళ్లలాగే ఉన్నా కూడా కొబ్బరి నీళ్లల్లో పోషకాలు మాత్రం చాలా ఉంటాయి. వేసవిలో కొబ్బరి నీళ్లు పర్ఫెక్ట్ డిటాక్స్ డ్రింక్ అని చెప్పాలి. ఇవి తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చట. అలాగే కీర దోసకాయ, సొరకాయ, కొత్తిమీరను మిక్సీ పట్టి ఆ నాలుగు నుంచి వచ్చిన జ్యూస్ ని ఉదయాన్నే తాగడం వల్ల మన శరీరంలో ఉన్న వ్యర్ధాలు అన్ని బయటకు వెళ్ళిపోయి బరువు కూడా సులభంగా తగ్గవచ్చని చెబుతున్నారు.

అలాగే రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి వాము నీరు తాగడం చాలా మంచిదట. ఈ నీళ్లు తాగడం వల్ల అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు మన దరిదాపుల్లోకి రావని అలాగే ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. అలోవెరా జ్యూస్ కూడా మన శరీరంలో ఉండే కొవ్వును బాగా తగ్గిస్తుందట. ఈ జ్యూస్ తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వడంతో పాటు అజీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు. ఉదయాన్నే గోరువెచ్చని జీలకర్ర నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావట. ఇలా తాగడం వల్ల జీర్ణశక్తి పెరిగి బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుందట. టిఫిన్ తినే అరగంట ముందు నిమ్మకాయ నీళ్లలో కొంచెం తేనె కలుపుకుని తాగితే చాలా మంచిదట. ఇలా రోజు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు సులువుగా బరువు కూడా తగ్గవచ్చని చెబుతున్నారు.