Silver Date Palm: వేసవికాలంలో దొరికే ఈత పండ్ల వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో మీకు తెలుసా?

వేసవికాలంలో మాత్రమే లభించే ఈత పళ్ళ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఈత పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Published By: HashtagU Telugu Desk
Silver Date Palm

Silver Date Palm

మనకు వేసవి కాలంలో చాలా రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో ఈత పండ్లు కూడా ఒకటి. ఈత పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈత పళ్ళను తరచుగా తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. వేసవికాలంలో మాత్రమే లభించే ఈత పండ్లను ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. ఈత పండ్లలో గ్లూకోజ్, సుక్రోజ్, ప్రక్టోజ్ లు తక్షణ శక్తినిస్తాయట.

వీటిని తినటం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందించి వేసవిలో వచ్చే అలసట నుండి దూరం చేస్తుందని, ప్రతిరోజు ఉదయం ఈత పండ్లు జీర్ణశక్తి మెరుగు పడుతుందట. దీంతో అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు పోతాయట. ఈత పండ్లలో ఐరన్ సంమృద్ధిగా ఉంటుందట. వీటిని తినటం వల్ల శరీరంలో రక్త శాతం కూడా పెరుగుతుందని, అలాగే రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుందని, ఎనిమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. వేసవిలో దొరికే ఈ పండ్లను తినటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందట.

వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అటువంటి సమయంలో ఈత పండ్లు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయట. అలాగే ఈత పండ్లను రోగనిరోధక గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆంటీ బయాటిక్ గా పనిచేసే సీజనల్ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతాయట. అయితే మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈత పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు.

  Last Updated: 20 May 2025, 10:58 AM IST