Site icon HashtagU Telugu

Summer Drinks: వేసవిలో ఈ జ్యూస్‌లు తాగితే చాలు.. అందమైన మెరిసే చర్మం మీ సొంతం!

Summer Drinks

Summer Drinks

వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ఆహార పదార్థాలతో పాటు కొన్ని రకాల పానీయాలు తీసుకోవాల్సిందే. వేసవి కాలం వచ్చింది అంటే ఆహార పదార్థాలకు బదులుగా ఎక్కువగా ద్రవ రూపంలో ఉండే పానీయాలు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే వేసవికాలంలో ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల పానీయాలు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందట. ఇంతకీ ఆ పానీయాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. వేసవిలో క్యారెట్, బీట్‌రూట్, అల్లం, నిమ్మకాయ రసం కలిపి జ్యూస్ చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుందట. ముఖంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటాయని చెబుతున్నారు.

అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట. వేసవిలో చర్మంపై మొటిమలు, మచ్చలు లేకుండా కాంతివంతంగా ఉండాలంటే తప్పకుండా జ్యూస్‌ లు తప్పనిసరిగా తాగాల్సిందే అంటున్నారు. కేవలం పండ్ల రసాలు మాత్రమే కాకుండా కూరగాయల జ్యూస్‌ లు కూడా తీసుకోవాలని చెబుతున్నారు. వీటిని తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. కాగా అల్లంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయట. ఇవి చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుందట. ఇందులోని పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయట. డైలీ క్యారెట్ జ్యూస్‌ ను తాగడం వల్ల చర్మం మెరుస్తుందట.

క్యారెట్ లోని పోషకాలు, విటమిన్లు చర్మాన్ని మెరిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయట. మీరు తయారు చేసుకునే జ్యూస్‌ లో క్యారెట్ వేసి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. బీట్‌రూట్ చర్మాన్ని మెరిపిస్తుందట. అలాగే నల్లగా ఉన్నవారు డైలీ ఈ జ్యూస్ తాగితే తప్పకుండా తెల్లగా అవుతారట. ఈ జ్యూస్ తాగడం వల్ల ముఖం కూడా మెరుస్తుందట. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరిపిస్తాయట. కాగా వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. అలాగే నిమ్మరసాన్ని మీరు జ్యూస్‌ లో యాడ్ చేసుకోవడం లేదా నిమ్మరసాన్ని డైరెక్ట్‌‌గా తాగడం వల్ల చర్మం మెరుస్తుందట. ముఖంపై ఉండే మొటిమలు అన్ని కూడా తొలగిపోతాయట. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావని, ఈజీగా బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు.