Site icon HashtagU Telugu

Summer Health Tips: సమ్మర్ లో ఫిట్ గా ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ జ్యూసులు తాగాల్సిందే.. అవేంటంటే?

Summer Health Tips

Summer Health Tips

వేసవికాలం మొదలయ్యింది అంటే చాలా రకరకాల అనారోగ్య సమస్యలు, అందానికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి నుంచి బయటపడాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం రకరకాల పానీయాలు తాగుతూ ఉంటారు. వాటితో పాటుగా ఇప్పుడు చెప్పే పానీయాలు తాగితే వేసవిలంలో కూడా ఆరోగ్యంగా ఫిట్, అందంగా ఉంటారని చెబుతున్నారు.. ఇంతకీ ఆ జ్యూస్ లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పాలకూర, దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌ గా ఉంచుతుందట. ఎండాకాలంలో వీటిని తింటే శరీరంలో నీటి శాతం పెరిగి హైడ్రేట్‌ గా ఉంటారట. అలాగే పాలకూర, దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుందట. ఇది శరీరాన్ని హైడ్రేట్‌ గా ఉంచుతుందట. వేసవి కాలంలో వీటిని తింటే శరీరంలో నీటి శాతం పెరిగి హైడ్రేట్‌ గా ఉంటారని చెబుతున్నారు.

అలాగే శరీరంలో తక్కువ నీటి స్థాయిలు మన ఆరోగ్యంతో పాటు చర్మాన్ని కూడా దెబ్బతీస్తాయట. అయితే దోసకాయ శరీరాన్ని హైడ్రేట్‌ గా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంని చెబుతున్నారు. కాబట్టి దోసకాయ జ్యూస్ ఇంట్లోనే తయారు చేసుకుని తాగవచ్చని, రుచి కోసం కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

కాగా రుచికరమైనది మాత్రమే కాకుండా రైతా చాలా ఆరోగ్యకరమైనది అని చెప్పాలి. దోసకాయతో రైతా చేయడం చాలా ఈజీ. వేసవి కాలంలో దోసకాయ రైతా తిన్నా, తాగినా కడుపు చల్లగా ఉంటుందట. ఇది జీర్ణక్రియ వేగాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. అలాగే దోసకాయ, పాలక్ సలాడ్‌ని ఏ సీజన్‌ లో అయినా తీసుకోవచ్చట. ముఖ్యంగా వేసవి, చలికాలంలో ఎప్పుడు తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. టమోటాలు, దోసకాయలు ఇతరులతో చేసిన సలాడ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలట. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి చర్మాన్ని మెరిసేలా చేస్తుందట.