Summer Food: వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ డ్రింక్ తాగాల్సిందే!

  • Written By:
  • Publish Date - March 15, 2024 / 04:12 PM IST

వేసవికాలం మొదలయ్యింది. ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే భయపడుతున్నారు. రోజురోజుకీ ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది. దీంతో వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కనుక రోజూ తినే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. మరి ముఖ్యంగా వేసవిలో ఆరోగ్యం విషయంలో తీసుకునే ఆహారం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. కాగా నిపుణులు వివరాల ప్రకారం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది విపరీతమైన ఎండలు ఉండనున్నాయి.

అయితే ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం శరీరం వడ దెబ్బ తగలకుండా ఉండాలంటే ముందుగా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇందుకు పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తాయి. అంతేకాదు శరీరానికి వేసవి కాలంలో ఉపశనాన్ని కూడా కూరగాయలు ఇస్తాయి. ముఖ్యంగా ఆకుపచ్చ కూరగాయలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎండా కాలంలో చాలా మంది కడుపు సమస్యలతో బాధపడుతుంటారు. మజ్జిగను ఆహారంలో చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడతారు. పెరుగు, నల్ల ఉప్పు కలిపి దాహార్తిని తీర్చే మజ్జిగను తయారు చేసుకుని తరచుగా తాగాల్సి ఉంది.
ప్రతిరోజూ నిమ్మరసం తాగండి.

నిమ్మకాయలో విటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువ. ఇది వేడి నుండి రక్షించడమే కాదు. బదులుగా ఇది శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. ఫలితంగా మీరు రోజుకు కొన్ని గ్లాసుల నిమ్మరసం త్రాగవచ్చు. వేసవిలో ఎలాంటి శరీర రుగ్మతలు రాకుండా ఉండాలంటే పుల్లటి పెరుగు తినాలి. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. అవసరమైతే లస్సీని తయారు చేసుకుని రోజుకు ఒకసారి తాగవచ్చు. అయితే లస్సిలో చక్కెర బదులుగా బ్రౌన్ షుగర్ ని ఉపయోగించడం మంచిది. ఇది వడ దెబ్బ ప్రమాదాన్ని నివారించడానికి కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. ఇవి శరీరాన్ని వేడిగా మార్చగలవు. అవసరమైతే కుండలోని చల్లని నీటిని తాగండి. లేదా కొబ్బరి నీరు తాగాలి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. కీర దోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక రోజుకు కనీసం ఒక కీర తినడం మంచిది. కీర తినడం ఇష్టం లేకపోతే తర్వాత పెరుగులో కలుపుకుని తినవచ్చు.