Site icon HashtagU Telugu

Ice Apples: వేసవిలో తాటి ముంజలు.. ఆరోగ్య ప్రయోజనాలు

Ice Apples

Ice Apples

మనకు వేసవికాలంలో ఎక్కడ చూసినా కూడా తాటి ముంజలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఐస్ ఆపిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వేసవిలో విరివిగా దొరికే ఈ తాటి ముంజల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ తాటి ముంజలు ఎండ వేడి నుంచి కాపాడతాయి. అంతేకాకుండా శరీరం డీహైడ్రేషన్ కి గురికాకుండా చూస్తుంది. ఈ ఐస్ యాపిల్‌లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి.

వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. అలాగే చికెన్‌పాక్స్‌తో బాధపడే వారికి దురద నుంచి ఉపశమనం అందించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. వేసవి కాలంలో శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. ఇందులో బి విటమిన్లు, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వేసవి కాలంలో శరీరానికి సహజసిద్ధమైన కూలింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది. వేసవిలో వేడిని తట్టుకోవడానికి ఇది ఉత్తమమైన పండు. బరువు తగ్గాలనుకునే వారు తాటి ముంజలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

తాటి ముంజలు తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి కూడా వేయదు. అంతే కాకుండా ఇందులో ఉండే నీరు చెర్రీస్ అన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. గర్భిణీ స్త్రీలు ఐస్ యాపిల్ తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గర్భధారణ సమయంలో సాధారణంగా సంభవించే మలబద్ధకాన్ని నివారిస్తుంది. వేసవిలో సాధారణంగా ఎక్కువ చెమట పట్టడం వల్ల చాలా అలసిపోతారు. తాటి ముంజలు అలసటని దూరం చేస్తాయి. దీనిలో అధిక మొత్తంలో పొటాషియం శరీరంలోని టాక్సిన్స్‌ను శుభ్రపరుస్తుంది, కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది. ఈసమ్మర్ ఫ్రూట్ తాటి ముంజల్లో తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. కాబట్టి లేతగా ఉన్న వాటిని ఎన్ని తీసుకున్నా ఇబ్బంది ఉందు. అయితే కొంచెం ముదురుగా ఉన్నా తినకపోవడమే మంచిది. .