Summer exercising tips: ఎండాకాలంలో వ్యాయామం చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

మామూలుగా ఎక్ససైజ్ చేయడానికి వ్యాయామాలు చేయడానికి కాలంతో సంబంధం లేదు అని అంటూ ఉంటారు. అందుకే చాలామంది కాలంతో సంబంధం లేకుండా క్రమం తప్

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 08:00 PM IST

మామూలుగా ఎక్ససైజ్ చేయడానికి వ్యాయామాలు చేయడానికి కాలంతో సంబంధం లేదు అని అంటూ ఉంటారు. అందుకే చాలామంది కాలంతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా వర్కౌట్స్ వ్యాయామం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే చలికాలం అయినా ఎండాకాలమైనా శరీరానికి తగిన శ్రమ కల్పించినప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. కొందరు చలికాలం మాత్రమే వర్కౌట్ చేసి ఎండాకాలం వచ్చేసరికి వర్కౌట్స్ చేయడానికి ఎంతగా ఇష్టపడరు. ముఖ్యంగా వేసవిలో చాలామంది బరువును తగ్గించుకోవడం కోసం జిమ్ కి వెళ్తూ ఉంటారు. అయితే ఒకవేళ సమ్మర్ లో వ్యాయామాలు చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.

ముఖ్యంగా ఔట్ డోర్ వర్కవుట్స్ చేసే వారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవిలో వ్యాయామం చేయాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటిస్తే సమ్మర్‌లో వర్కవుట్స్ సాఫీగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎండాకాలంలో చెమట ఎక్కువగా వస్తుంది. అందుకే వీలైనంత సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు అయితే చెమటను పీల్చుకుంటాయి. చాలా మంది కాటన్ దుస్తులు వేసుకోవాలని చెబుతుంటారు. అయితే కాటన్ దుస్తులు చెమటను పీల్చుకుని బరువుగా మారతాయి.

అందుకే వదులుగా ఉండే దుస్తులు ధరించి ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకోవాలి. అదేవిదంగా శరీరంలో 50 నుంచి 70 శాతం నీరు ఉంటుంది. వేసవిలో శరీరం సరిగ్గా పని చేయడానికి నీరు చాలా అవసరం. శరీరం నుండి వ్యర్థాలు చెమట, మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది. అలా శరీరంలో నీరు తగ్గుతుంది. దానిని భర్తీ చేయకపోతే డీహైడ్రేషన్ కు గురవుతాం. అలా కావొద్దంటే రోజూ తగినంత నీరు తాగాలి. చేసే పనిని బట్టి నీరు తాగుతూ ఉండాలి.

వ్యాయామం చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో నీరు తాగుతుండాలి. వికారం, వాంతులు, మూత్రపిండ వైఫల్యం వంటి డీహైడ్రేషన్ వంటి కొన్ని తీవ్రమైన ప్రభావాలను నివారించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే వేసవికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ వేడిమిని తట్టుకోవడం కొంత మందికి చాలా కష్టంగా ఉంటుంది. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడైనా శరీరం చూపించే కొన్ని సూచనలను చాలా జాగ్రత్తగా గమనించాలి. విపరీతమైన దాహం, వికారం, తిమ్మిర్లు, నోరు పొడిబారడం లాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వర్కవుట్స్ ఆపేసి చల్లని ప్రదేశంలో కాసేపు సేదతీరాలి. నిమ్మరసం, గ్లూకోజ్ వాటర్ లాంటివి తాగిన తర్వాత తిరిగి తేలికపాటి వర్కవుట్స్ చేయవచ్చు. కాబట్టి వేసవిలో వర్క్ ఔట్స్ చేయడం మంచిదే కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.