Site icon HashtagU Telugu

Buttermilk: ఎండాకాలంలో మజ్జిగ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?

Buttermilk

Buttermilk

మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. మజ్జిగను తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కొందరు పెరుగన్నం తినడానికి ఇష్టపడితే మరి కొందరు మజ్జిగ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల కాల్షియం, విటమిన్లు, పొటాషియం, ప్రోబయోటిక్స్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. మజ్జిగ జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుందట. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది చాలా మేలు చేస్తుందట.

ఇది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ కలిగి ఉంటుందట. మిగతా సీజన్ లతో పోల్చుకుంటే వేసవికాలంలో మనకు రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కూడా మజ్జిగను కుండల్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. బయట దొరికే సీతల పానీ ఇయ్యాల కంటే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వేసవికాలంలో మజ్జిగ తాగడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవికాలంలో మజ్జిగ తాగడం వల్ల ఉల్లాసంగా ఉండవచ్చు. అయితే సరైన సమయం అంటూ ఏమీ లేకుండా వేసవిలో ఈ మజ్జిగను ఎప్పుడైనా తాగవచ్చు.

వేసవికాలంలో ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంటికి వస్తే శీతల పానీయాలు జ్యూస్ల కంటే ఈ చల్లటి మజ్జిగను ఇవ్వడం మంచిది. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం మంచిదట. అలాగే రాత్రిపూట నిద్రపోయేటప్పుడు పుల్లని మజ్జిగా ఎక్కువగా తీసుకోకూడదట. అయితే చల్లటి మజ్జిగను తయారు చేసుకోవడం కోసం పెరుగును బ్లెండర్లో వేసి మూడు నుండి ఐదు నిమిషాలు బ్లెండ్ చేయాలి. తర్వాత అందులో చల్లటి నీరు వేసి, మూడు నుండి ఐదు నిమిషాలు నెమ్మదిగా స్పీడ్‌ లో మళ్లీ కలపాలి. ఇప్పుడు అందులో పుదీనా పొడి, జీలకర్ర పొడి వేసి మిక్స్ చేసి తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చేతికవ్వంతో చిలికితే ఇంకా రుచి వస్తుంది అని చెబుతున్నారు.