Sugarcane: వేసవిలో చెరుకు రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

చెరుకు రసం.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి తాగుతూ ఉంటారు. ఇక వేసవికాలంలో అయితే మనకు దారి పొడవునా ఈ చెరుకు రసం బం

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 05:30 PM IST

చెరుకు రసం.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి తాగుతూ ఉంటారు. ఇక వేసవికాలంలో అయితే మనకు దారి పొడవునా ఈ చెరుకు రసం బండ్లు కనిపిస్తూ ఉంటాయి. వేసవి కాలంలో చాలామంది కనీసం రోజుకు ఒక్కసారైనా కూడా చెరుకు రసం తాగాలని అనుకుంటూ ఉంటారు. బాగా ఎండకు తిరిగి ఒక చోట నిలబడి చల్లటి చెరుకు రసం తాగితే ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చెరకు రసం అలసిన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. ఇది అనేక సమస్యలకు సహజ నివారణిగా ఉపయోగపడుతుంది.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. చెరుకు రసం తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో తొందరగా అలసిపోయినట్టు టైడ్ అయినట్లు అనిపిస్తూ ఉంటుంది. మీకు అలసటగా లేదా బలహీనంగా అనిపిస్తే, మీరు చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు. ఇది సహజ స్వీటెనర్లను కలిగి ఉంటుంది, ఇనుము కలిగి ఉంటుంది ,తక్షణ శక్తిని ఇస్తుంది. అదనంగా చెరకు రసం డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. ఇందులో ఎలక్ట్రోలైట్ ఉంటుంది. వేసవిలో తీవ్రమైన నీటి పోషకాహార లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు బాగా దాహం వేసినా లేదా డీహైడ్రేషన్‌కు గురైనట్లు అనిపించినా రోజూ చెరుకు రసం తాగవచ్చు.

ఇన్ఫెక్షన్‌లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది . ఇందులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఇతర ఎలక్ట్రోలైట్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఇది సాధారణ జలుబుతో పాటు ఇతర ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. శరీరం యొక్క ప్రోటీన్ స్థాయిలను పెంచుతుంది. చెరకు రసం మూత్రవిసర్జన సమస్యలను నిర్మూలిస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులను, మూత్రపిండాల్లో రాళ్లను నయం చేయడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. చెరకు రసం కాలేయాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అందువలన కామెర్లు వంటి వ్యాధులకు చక్కటి నివారణగా సూచించబడింది. చెరకు రసం యొక్క మరొక ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే, ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఐరన్, పొటాషియం ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వేసవిలో చెరుకు రసం తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.