Health: చెరకు జ్యూస్.. ఆరోగ్యానికి యమ బూస్ట్

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 02:06 PM IST

Health: చెరకుతో ఆరోగ్యనాకి కావల్సిన కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఈ చెరకు రసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినిరల్స్, విటమిన్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. చెరకు రసం పిల్లలు, పెద్దల నోరూరించే చెరకు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చెరకు రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. తక్షణ శక్తినందించడం దీని ప్రత్యేకత. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు మేళవించి చేసే చెరకు రసంలో పోషకాలు కూడా అధికంగానే ఉన్నాయి.

శీతల పానీయాలు, కోలాలతో పోలిస్తే ఇది నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. శరీరంలో నీటిస్థాయి పడిపోకుండా జాగ్రత్తపడుతుంది. మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడే వారికి చెరకు రసం చక్కని పరిష్కారం. అంతే కాకుండా కొన్ని ప్రత్యేకమైన జబ్బులను ఇది నివారిస్తుంది. అవేంటో చూద్దాం…
సుగర్ కేన్ జ్యూస్(చెరకు రసం) కామెర్లును సహజంగా నయం చేసే ఒక ఔషధం. రక్తంలోని బిల్లిరుబిన్ కారణంగా కామెర్లు ఏర్పడి చర్మం పొరలుగా పసుపు రంగులోకి మారుతాయి. ఇది కాలేయ పనితీరు సరిగా లేకపోవడం మరియు పిత్తాశయ వాహికలు మూసుకుపోవడం వల్ల కామెర్లకు కారణం అవుతుంది.

కాబట్టి దీని నుండి బయట పడటానికి ఒక గ్లాసు చెరకు రసంకి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి ప్రతి రోజూ తీసుకోవాలి. చెరకు రసంతో ఇది చాలా ప్రభావవంతమైన ఆరోగ్య ప్రయోజనం. డీహైడ్రేషన్ వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడుతాయి. కాబట్టి ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు విచ్చినం చేయడానికి సహాయం చేస్తుంది. ఎక్కువ ద్రవాలను మరియు చెరకు రసాన్ని తాగడం వల్ల మూత్రపిండంలో రాళ్ళు విచ్చిన్నం చేయడానికి, కరిగిపోవడానికి చెరకు రసం ఉపయోగపడుతుంది.