చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే హెల్తీ డ్రింక్ చెరుకు రసం. ఇది కల్తీ లేని పానీయం అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ చెరుకు రసంలో కొద్దిగా అల్లం నిమ్మరసం కొంచెం పుదీనా వేసుకొని తాగితే ఆ టేస్ట్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇలా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అలసటను దూరం చేయడంతో పాటు శరీరానికి కావాల్సిన శక్తిని కూడా అందిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో చెరుకు రసం తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉంచుతాయి. ఈ రసంలో ఉండే చక్కెరని శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది.
శరీరం డిహైడ్రేషన్ కి లోనైనప్పుడు చెరుకు రసం తాగితే తక్షణ శక్తి వచ్చి త్వరగా కోలుకుంటారు. మధుమేహం ఉన్నవారు కూడా ఈ చెరుకురసం తాగవచ్చు. ఇది దంత సమస్యలను కూడా నివారిస్తుంది. ఈ జ్యూస్ కాలేయ వ్యాధులు కామెర్ల నుంచి కాలేయానికి రక్షణ ఇస్తుంది. చెరుకు రసం శరీరం నుండి టాక్సిన్స్ ఇన్ఫెక్షన్స్ తొలగించడంలో సహాయపడే అద్భుతమైన మూత్ర విసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది. చెరుకు రసం తాగడం వల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు కిడ్నీలో రాళ్లు రాకుండా ఉంటాయి. ఇది కిడ్నీల సరైన పనితీరుకు దోహదపడుతుంది. మన శరీరానికి అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది.
రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరిస్తోంది. జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. ఒత్తిడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది..ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. దప్పికను నివారించి వెంటనే శక్తినిస్తుంది. రక్తహీనతలు తగ్గిస్తుంది. క్యాన్సర్లను నివారిస్తుంది. స్త్రీలలో వచ్చే గర్భాదారణ సమస్యలను తొలగిస్తుంది. మూత్ర సంబంధత ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. తినడం కంటే దాని జ్యూస్ తాగడం వల్ల ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.