Site icon HashtagU Telugu

Tonsils : టాన్సిల్స్‌ వేధిస్తున్నాయా ? ఆయుర్వేద టిప్స్ ఇవిగో

Tonsils

Tonsils

Tonsils : టాన్సిల్స్ సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. మన ఇంట్లోని చిన్న పిల్లలు, కొన్ని సందర్భాల్లో పెద్దలు కూడా ఈ ప్రాబ్లమ్‌తో బాధపడుతుంటారు. టాన్సిల్స్ అనేవి ఆస్పత్రికి వెళ్లాల్సినంత పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ కావు. అలా అని వాటిని పట్టించుకోకుండా వదిలేయలేం. టాన్సిల్స్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆయుర్వేదంలో చక్కటి ఉపాయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join.

  • పటిక యాంటీ సెప్టిక్‎గా పని చేస్తుంది. పటికను ముక్కలుగా చేసి మూకుట్లో వేసి పాప్ కార్న్ మాదిరి పొంగించుకోవాలి. అనంతరం దాన్ని చేతిలో ఒత్తుకుంటే పొడి వస్తుంది. ఒక కప్పు వేడి నీళ్లను తీసుకొని, వాటిలో అరచెంచా పటిక పొడి వేసి కలుపుకోవాలి. ఈ నీటిని గొంతు వరకు చేరేలా ఉదయం, సాయంత్రం పుక్కిలించాలి.
  • తిప్పతీగ, యష్టిమధు, గుగ్గిళ్లు, పటిక, తేనెతో కషాయం తయారు చేయొచ్చు. ఇందుకోసం తిప్పతీగను, శుద్ధి చేసిన గుగ్గిళ్లను,  యష్టిమధును వేర్వేరుగా చూర్ణాలుగా చేయాలి. అనంతరం 50 గ్రాముల తిప్పతీగ చూర్ణాన్ని, 50 గ్రాముల యష్టిమధు చూర్ణాన్ని, 50 గ్రాముల శుద్ధి చేసిన గుగ్గిళ్లను కలుపుకొని పొడి తయారు చేయాలి.  ఈ పొడితో కషాయం తయారు చేసుకోవాలి.
  • నీళ్లు మరుగుతుండగా ఒక చెంచా పొడిని వేసుకోవాలి. కప్పు నీళ్లు మరిగి అరకప్పు అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. కాస్త గోరువెచ్చగా మారిన తర్వాత చెంచా తేనెను కలుపుకోవాలి.ఇక టాన్సిల్స్‌కు చెక్ పెట్టే కషాయం రెడీ అయినట్టే.

Also Read: Dawood Properties : దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎన్ని ఆస్తులున్నాయంటే ?

జీవనశైలి కారణంగా  చాలామంది అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇది చివరకు గురక సమస్యకు కారణమవుతోంది. అది పెరిగి ఓఎస్‌ఏకు దారి తీస్తోంది. ముఖ్యంగా ముఖం, మెడ, ఛాతీ ప్రాంతం చుట్టూ కొవ్వు అధికంగా చేరడం వల్ల అది శ్వాసనాళాలపై ప్రభావం చూపుతోంది. వెరసి కొందరిలో టాన్సిల్స్‌(Tonsils) ఏర్పడుతున్నాయి. పిల్లల్లో టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌ అలెర్జీలు గురక, ఓఎస్‌ఏ సమస్యను పెంచుతున్నాయి. ముక్కుతో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడతారు. కొందరి పిల్లల్లో ఈ సమస్య హైపర్‌ యాక్టివిటీకి కారణమవుతుంది.

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.