Site icon HashtagU Telugu

Summer: వడదెబ్బతో బాధపడుతున్నారా.. ఈ జాగ్రత్తలు మస్ట్, అవి ఏమిటంటే

Summerseason4 1520596663

Summerseason4 1520596663

Summer: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతుండటంతో వడదెబ్బ బారిన పడేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బకు చెక్ పెట్టొచ్చు.. అవి ఏమిటంటే.. వడదెబ్బకు గురికాకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుండి బయటికి రావొద్దు. ఉదయం లేదా సాయంత్రపు వేళల్లో మాత్రమే బయటికి రావాలి. సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలతో ప్రయాణం చేయొద్దు. రద్దీగా ఉండే ప్రదేశాలలో చలివేంద్రాల్లోని నీటిని తాగి ఎండ బారి నుంచి కాపాడుకోవాలి. వ్యవసాయ కూలీలు, కార్మికులు వడదెబ్బకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాలి. శీతల పానీయాలు, చల్లగా ఉండే ఆహార పదార్థాలు తగ్గించుకోవాలి.

వడ దెబ్బకు గురైన వ్యక్తులకు అందించాల్సిన ప్రథమ చికిత్సపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాలి. జ్యూస్ కేంద్రాలను, ఐస్ క్రీమ్ నాణ్యతలు లేకుండా మార్కెట్లో ఉంటున్నాయి. కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొనుకొని తాగాలి. కాటన్ వస్త్రాలు ధరించాలని తెలిపారు. ప్రజలు బయటికి వెళ్లునపుడు తలకు ఎండ తగలకుండా గొడుగు, టోపి, కండువాతో తలను కప్పు కోవాలని సూచించారు.

ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల గుండె లయ తప్పుతుంది. శరీరంలోని శక్తినంతా పీల్చేసిన అనుభవం కలుగుతుంది. మెదడు కూడా సమతుల్యత తప్పుతుంది. ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతే మరణాలు సంభవిస్తాయి. వడదెబ్బ వల్ల 40 శాతం మేరకు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. వడదెబ్బ వల్ల శరీరంలోని నీటి శాతం కోల్పోతారు. చెమట పట్టడం నిలిచిపోతుంది. నాడి వేగం పెరుగుతుంది. శరీరం అదుపుతప్పుతుంది. మెదడు స్వాధీనంలో ఉండకపోవడం వల్ల గందరగోళానికి గురవ్వుతారు. కళ్లు మసకబారుతాయి. వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే కోమాలోకి జారుకుంటారు. పొడి చర్మం ఉండేవారు కూడా త్వరగా వడదెబ్బకు గురవ్వుతారు. కాబట్టి పై జాగ్రత్తలు విధిగా పాటించాలి