Knee Pains : మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? వీటితో చెక్ పెట్టండి..!!

ఈరోజుల్లో నలుగురిలో ముగ్గురు మోకాళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కొంటున్నారు. కాలం ఏదైనా సరే చాలామందిని మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 10:44 AM IST

ఈరోజుల్లో నలుగురిలో ముగ్గురు మోకాళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కొంటున్నారు. కాలం ఏదైనా సరే చాలామందిని మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. సాధారణంగా కీళ్లనొప్పుల కారణంగా వృద్ధులకు మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. కానీ ప్రస్తుత రోజుల్లో 25 నుంచి 30 ఏళ్లకే ఈ సమస్య వస్తుంది. దీనికి కారణం మన జీవనశైలి. సరిపడా ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, సరైన పోషకాలు అందకపోవడం వల్ల చిన్న వయస్సుల్లోనే మోకాళ్ల నొప్పులు వేధిస్తుంటాయి. కాబట్టి దీన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం.

అధిక బరువుపై శ్రద్ధ వహించడం..!
ఎత్తు వయస్సు కంటే శరీర బరువు ఎక్కువగా ఉంటే మోకాలిపై బరువు పడుతుంది. దీంతో మోకాళ్ల నొప్పులు వస్తాయి. కాబట్టి మీ శరీర బరువును మీ హైట్ కు తగ్గట్లుగా ఉండేలా చూడాలి. అధిక బరువు ఉంటే తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే నొప్పులు అదుపులో ఉంటాయి. వీలైనంత వరకు ఆయిల్ ఫుడ్ , జంక్ ఫుడ్ దూరంగా ఉండటం మంచిది.

వ్యాయామం తప్పనిసరి…!
శరీరంలో ఏ భాగంలో నొప్పి అధికంగ వస్తుందో ఆ భాగంలో కండరాలు బలంగా ఉండేలా వ్యయామాలు చేయండి. ఇలా చేస్తే క్రమం తప్పకుండా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మోకాలి నొప్పి ఉంటే వృక్షాసనం, నడక, సైకిల్ రైడింగ్ వంటి యోగాసనాలు చేయండి.

ఈ ఆహార పదార్థాలకు దూరంగా!
ఎముకలు, కండరాలను బలహీనపరిచే ఆహారాలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. దీంతో మోకాళ్ల నొప్పులు అదుపులో ఉంటాయి. మధ్యం, ధూమపానం, పెరుగు, కాలీఫ్లవర్ వంటి వాటికి దూరంగా ఉండండి. ఇలా చేస్తే కండరాలను కాపాడుకోవచ్చు.

పంచకర్మ చికిత్స!
ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స అనేది చాలా ఉత్తమమైంది. ఈ చికిత్స శరీరాన్ని నిర్విషికరణ చేస్తుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవారు ఈ పంచకర్మ చికిత్స తీసుకోవచ్చు. దీంతో నొప్పితోపాటు శరీరాన్ని మరింత శక్తివంతంగా ఉంచుకోవచ్చు.

పసుపు, అల్లం..!
యాంటీ ఇన్ ఫ్లమేటర్ గుణాలు ఉన్న పసుపు, అల్లం తీసుకుంటే శరీరంలో నొప్పి తగ్గుతుంది. ఈ రెండు కూడా ఆర్థరైటిస్ లక్షణాల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. దీంతో మోకాళ్ల నొప్పులకు స్వస్తి పలకవచ్చు.