Site icon HashtagU Telugu

Mint Water: గ్యాస్ సమస్యతో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఈ పని చేయాల్సిందే?

Mixcollage 04 Jul 2024 09 28 Am 9332

Mixcollage 04 Jul 2024 09 28 Am 9332

మన వంటింట్లో దొరికే ఆకుకూరల్లో పుదీనా కూడా ఒకటి. పుదీనా వాసనతో పాటు రుచి కూడా కాస్త ఘాటుగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దాంతో చాలామంది పుదీనాను తినడానికి ఇష్టపడరు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ ఫైటో న్యూట్రియెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుదీనాను తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే పుదీనా నీరు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి పుదీనా వల్ల ఇంకా ఏయే లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పుదీనా ఆకుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఒక గ్లాస్ పుదీనా నీటిని తాగడం వల్ల నోటిలో ఉండే క్రిములు నశించిపోతాయి. కాగా ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు పుదీనా వాటర్ తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. పుదీనా బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందట. పుదీనాలో ఉండే విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, కార్భోహైడ్రేట్లు, ఐరన్, విటమిన్ ఎ, కేలరీలు, ప్రోటీన్లు, మినరల్స్ లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే పుదీనా నీరు జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.

గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు పుదీనా నీరు తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పుదీనా నీరు తరచుగా తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగ్గా ఉండడంతో పాటు సులువుగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. పుదీనా నీటిని తాగితే కడుపునకు సంబంధించిన, జీర్ణ సమస్యలు తగ్గుతాయట. అదేవిధంగా పుదీనాలో ఉండే బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మ వ్యాధులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని చెబుతున్నారు వైద్యులు. అలాగే అవి మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి కూడా సహాయపడతాయట. అంతేకాదు పుదీనా చర్మాన్ని మృదువుగా, అందంగా మెరిసేలా చేస్తుందని పేర్కొన్నారు నిపుణులు.

Note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి.