Cough: విపరీతమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిన్న చిట్కాలతో ఉపశమనం పొందండిలా?

మామూలుగా చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా దగ్గు జలుబు సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొంతమంది వేసవిలో కూడా ఈ దగ్గు జలుబు సమ

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 11:00 AM IST

మామూలుగా చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా దగ్గు జలుబు సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొంతమంది వేసవిలో కూడా ఈ దగ్గు జలుబు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం చలికాలం కావడంతో చాలామంది ఈ సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా జలుబు దగ్గు మనిషిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. విపరీతమైన దగ్గు కారణంగా రాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టక నిద్రలేమి సమస్యలు కూడా మొదలవుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు ఆ దగ్గు సమస్యకు పెట్టవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవి అన్న విషయానికి వస్తే.. కొన్ని కొన్ని సార్లు కంటిన్యూగా దగ్గు వచ్చి మనిషిని కుంగదీస్తూ ఉంటుంది.

బాగా ద‌గ్గు రావ‌డం వ‌ల‌న మ‌న చాతి బాగంలో నొప్పి ఎక్కువ‌గా లేదా భారంగా అనిపిస్తున్నా మంట‌గా ఉన్నా. చాలా నిర‌సించి పోతాము. విపరీతంగా దగ్గు వచ్చినప్పుడు మిరియాల కషాయం అందుకు ఎంతో బాగా పనిచేస్తుంది. లేదంటే అరచెంచా నల్ల మిరియాల పొడిని నెయ్యితో కలిపి తీసుకుంటే చాలు. దగ్గు సమస్యకు చెక్ పెట్టవచ్చు. అయితే కడుపు నిండుగా ఉన్నప్పుడు మాత్రమే ఇది తినాలి. వేడివేడి మసాలా టీ అల్లం టీ తాగినా కూడా దగ్గు సమస్య కాస్త తగ్గుముఖం పడుతుంది. అలాగే సొంటిని నోటిలో దవడకపెట్టుకొని కొంచెం కొంచెం నములుతూ ఆ రసాన్ని మింగడం వల్ల కూడా దగ్గు సమస్యకు చెప్పి పెట్టవచ్చు.

ద‌గ్గు ఎక్కువ‌గా ఉన్న‌పుడు రోజూ రెండుపూట‌లా గ్లాస్ పాల‌లో కాస్త అల్లం లేదా వేల్లుల్లిని వేసి భాగా మ‌రిగించి, ఆ త‌రువాత ప‌సుపు వేసి గోరు వేచ్చ‌గా తాగితే ఉప‌స‌మ‌నం లభిస్తుంది. ఏదైనా ఇన్ఫేక్ష‌న్ ఉన్నా కూడా త‌గ్గిపోతుంది. ద‌గ్గు తీవ్రత ఎక్కువ‌గా ఉంటే రోజూ ఉద‌యాన్నే రెండు చేంచాలా తిప్ప‌తిగ ర‌సాన్ని నీటిలో క‌లిపి తాగాలి. తిప్ప‌తిగ ర‌సం రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. మూడు దోషాలైన వాతం , పిత్త‌ , క‌ఫాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం తేలుస్తుంది. ప‌సుపులో క‌ర్క్యుమీన్ అనే ప‌దార్ధం వైర‌స్ ను భాక్టిరియా వంటి గోంతు వాపు వంటి లోనాల‌ను త‌గ్గిస్తుంది. అల్లం వేల్లుల్లి గోంతులోని ట్రాన్సిల్స్ ప్రాంతంలో దిబ్బ‌డ‌ను త‌గ్గించి స‌హ‌జ నొప్పిని త‌గ్గిస్తుంది. తేనె , య‌స్టిమ‌దురం పోడి , దాల్చించేక్క నీటిలో క‌లిపి ఉద‌యం సాయంత్రం తిసుకున్నా ద‌గ్గు నుండి ఉప‌స‌మ‌నం పోంద‌వ‌చ్చు. దానిమ్మ ర‌సం లో చిటికెడు అల్లం పోడి ,పిప్పాలి పోడి క‌లిపి తాగినా ద‌గ్గు త‌గ్గిపోతుంది. దానిమ్మ‌లో ఉండే విట‌మిన్ -సీ, విట‌మిన్- ఎ వ‌ల‌న మ‌న‌కు రోగ‌నిరిధ‌క శ‌క్తిని పెంచుతాయి. తేనెలో ఉండే డేక్స్టోమెథోర్ఫాన్ వాపుల‌ని త‌గ్గిస్తుంది.