Site icon HashtagU Telugu

Sunlight And Men: సూర్యకాంతితో పురుషుల్లో ఆకలి!!

Sunlight Hunger

Sunlight Hunger

ఆకలికి కారణం ఏమిటి ? ప్రత్యేకించి ఎండా కాలంలో
పురుషుల్లో ఆకలి ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి ? అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతూ
ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ యూనివర్సిటీలోని హ్యూమన్ జెనెటిక్స్ అండ్ బయోకెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఎండాకాలంలో ఎండలు, వడ గాలుల వల్ల వడదెబ్బ ముప్పు ఉంటుంది. మండుటెండలలోని
సూర్యరశ్మి పురుషులకు వేడి, ఉక్కపోతను కలిగించడమే కాక ఆకలిని కూడా కలిగిస్తుందని గుర్తించారు. ఇది పురుషుల్లో ఆకలిని పెంచే ప్రత్యేకమైన హార్మోన్‌ను ప్రేరేపిస్తుందని వెలుగులోకి వచ్చింది.అయితే అతినీలాలోహిత(UV) రేడియేషన్ వంటి పర్యావరణ సూచనలకు పురుషులు, మహిళలు భిన్నంగా ప్రతిస్పందిస్తారా? అనే దిశగా మాత్రం పరిశోధించలేదు.ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఎలుకలపై జరిపిన పరిశోధనలో..

ఎలుకలపై జరిపిన పరిశోధనలో పై అంశాలను గుర్తించారు. ‘ఎలుకలు, హ్యూమన్ మేల్స్‌లో పెరిగిన ఆకలి అనేది గ్రెలిన్ ప్రసరణ అధిక స్థాయిలతో సంబంధం కలిగి ఉంటుందని అధ్యయన నివేదిక పేర్కొంది. పరిశోధకులు మూడేళ్లలో జాతీయ పోషకాహార సర్వేలో భాగంగా 3,000 మంది పార్టిసిపెంట్స్ నుంచి డేటాను సేకరించి విశ్లేషించారు. ఇందులో పురుషులు మాత్రమే వేసవిలో రోజూ దాదాపు 300 కేలరీల అదనపు ఆహారాన్ని తీసుకునేవారని కనుగొన్నారు. ఇది ఏమంత ఎక్కువ కానప్పటికీ, ఎక్కువ కాలం ఇలాగే తీసుకుంటే బరువు పెరగడానికి దారితీస్తుందని పేర్కొన్నారు.

చర్మ కణాల్లోని డీఎన్ఏ దెబ్బతిని..

సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కావడంతో పురుషుల చర్మ కణాల్లోని డీఎన్ఏ దెబ్బతిని గ్రెలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. తద్వారా ఎక్కువగా తినాలనే కోరిక ఏర్పడుతుంది. మహిళల విషయానికొస్తే.. ఇది ఈస్ట్రోజెన్ ద్వారా నిరోధించబడుతుంది.
భోజనం తర్వాత గ్రెలిన్ స్థాయిలు అత్యల్పంగా ఉండి, ఆ తర్వాత పెరుగుతాయని వివరించింది. ఈ ఫలితాలు ఎండోక్రైన్-సంబంధిత వ్యాధుల్లో స్త్రీ, పురుషులకు వేర్వేరు చికిత్సా మార్గాలను గుర్తించేందుకు తలుపులు తెరుస్తాయని పరిశోధకులు వెల్లడించారు.