Bariatric Surgery: ఆరోగ్యకరమైన మూత్రపిండాలు మన ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఏదైనా కారణం వల్ల మూత్రపిండాలు ప్రభావితమైతే అది ప్రమాదకరం. మూత్రం ద్వారా మన శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించడానికి కిడ్నీలు పని చేస్తాయి. ఇటువంటి పరిస్థితిలో మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. వెయిట్ లాస్ సర్జరీ (Bariatric Surgery) కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
అధ్యయనం ఏం చెబుతోంది?
అధ్యయనం ప్రకారం.. మధుమేహం టైప్-2 రోగులలో బరువు తగ్గించే శస్త్రచికిత్స చేయించుకోవడం మూత్రపిండాల వైఫల్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ అధ్యయనం అన్నల్స్ ఆఫ్ సర్జరీ జర్నల్‌లో ప్రచురించబడింది. ఇక్కడ కిడ్నీ బారియాట్రిక్ శస్త్రచికిత్స 60% కిడ్నీ వ్యాధులను తగ్గించే అవకాశాన్ని చూపించింది. నివేదిక ప్రకారం.. డయాబెటిక్ పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంది. దాని కారణంగా వారు మరణించే అవకాశం కూడా ఉంది. నివేదిక ప్రకారం 40% మధుమేహ రోగులు కూడా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు.
Also Read: Uber Ride Pass: ఉబర్ కస్టమర్లకు ఓ బ్యాడ్ న్యూస్.. అలాగే ఓ గుడ్ న్యూస్..!
బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏమిటి?
బేరియాట్రిక్ సర్జరీ అనేది బరువు తగ్గించే శస్త్రచికిత్స. దీనిలో కడుపు, ప్రేగులపై శస్త్రచికిత్స ద్వారా కొవ్వు తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారి బరువు తగ్గించేందుకు ఈ సర్జరీ చేస్తారు. ఇతర పద్ధతుల ద్వారా బరువు తగ్గలేని వారికి ఈ శస్త్రచికిత్స చేస్తారు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ ప్రమాదం, అధిక-తక్కువ BP ప్రమాదం, శ్వాసకోశ సమస్యలు, గ్యాస్, రక్తహీనత, స్త్రీలలో గర్భం ధరించడంలో ఇబ్బంది మొదలైనవి వస్తాయి.
బేరియాట్రిక్ సర్జరీ కిడ్నీ వ్యాధి నుండి ఉపశమనం ఇస్తుందా?
ఈ కొత్త అధ్యయనం ప్రకారం బేరియాట్రిక్, మెటబాలిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ 425 మందిని కలిగి ఉన్న డయాబెటిక్ రోగుల సమూహంపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ వ్యక్తులు టైప్-3, 4 మధుమేహంతో పాటు ఊబకాయం, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. అధ్యయనం చేస్తున్న బృందం 183 మందికి బరువు తగ్గించే శస్త్రచికిత్సను ఉపయోగించింది. శస్త్రచికిత్స సమయంలో ఇచ్చిన మందులను కూడా వారికి వినియోగించేలా చేసింది.
పరిశోధకులు ఏమి నమ్ముతున్నారు?
ఈ మొత్తం ప్రక్రియ తర్వాత రోగులలో కిడ్నీలకు మరింత రక్షణ ఉందని పరిశోధనా బృందం భావించింది. ఈ రోగులలో మూత్రపిండాల సమస్యలతో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రించబడుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. అయినప్పటికీ బేరియాట్రిక్ శస్త్రచికిత్స కిడ్నీ వ్యాధిని తగ్గించగలదని నిరూపించడానికి మరిన్ని పరిశోధనలు, ఆధారాలు ఇంకా అవసరం ఉంది.