Site icon HashtagU Telugu

Monday Heart Attack: సోమవారంలోనే అధిక గుండెపోటు ప్రమాదాలు

Monday Heart Attack

New Web Story Copy 2023 06 06t160607.638

Monday Heart Attack: మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త రోగాలు దరిచేరుతున్నాయి. రుచి కోసం ఆహారాన్ని విషంగా మారుస్తున్నాం. అభివృద్ధి కోసం వాతావరణాన్ని కలుషితం చేస్తుకుంటున్నాం. టెక్నాలజీ పేరు చెప్పుకుని ఆకాశాన్ని రేడియేషన్ తో నింపేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి జీవనంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చిన్న చిన్న సమస్యలకే టెన్షన్, కోపం, నీరసం, హ్యాంగ్జైటీ వంటి సమస్యలు దరిచేరుతున్నాయి. ఈ క్రమంలో గుండెపోటు అనేది సాధారణమైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం కారణంగా వయసుతో సంబంధం లేకుండా అందర్నీ ఎటాక్ చేస్తుందీ హార్ట్ ఎటాక్.

గుండెపోటు అనేది ఒక నిర్దిష్ట రోజుల్లో ఎక్కువగా వస్తుందట. తాజా అధ్యయనాలు ఎం చెబుతున్నాయి అంటే.. గుండెపోటు అనేది సోమవారం రోజుల్లో ఎక్కువగా ఎటాక్ చేస్తుంది. తాజాగా మాంచెస్టర్‌లో జరిగిన బ్రిటిష్ కార్డియోవాస్కులర్ సొసైటీ కాన్ఫరెన్స్‌లో అధ్యయన ఫలితాలు బహిర్గతం చేశారు. బెల్ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్ మరియు ఐర్లాండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ వైద్యులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఈ పరిశోధన కోసం 20 వేల మందికి పైగా రోగులపై ఒక అధ్యయనం జరిగింది.

ST-సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (STEMI) మరింత తీవ్రమైన గుండెపోటు రోగులలో గమనించినట్లు పరిశోధకులు కనుగొన్నారు. సోమవారం నాడు STEMI గుండెపోటుల రేటు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఇది సోమవారాల్లో ఎందుకు జరుగుతుందో స్పష్టంగా తెలియలేదు, బెల్ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్‌లో పరిశోధనకు నాయకత్వం వహించిన కార్డియాలజిస్ట్ డాక్టర్ జాక్ లాటన్, మునుపటి అధ్యయనాల నుండి కనుగొన్న వాటిని ఉదహరిస్తూ సోమవారం ఉద్యోగులు కార్యాలయాల్లో అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారని చెప్పారు. ఒత్తిడి పెరగడం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పారు.

Read More: Mango Health Benefits: రాత్రిపూట అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే మామిడి పండు తినాల్సిందే?