Site icon HashtagU Telugu

Zika virus :తెలంగాణను వ‌ణికిస్తోన్న `జికా వైర‌స్ `

Mosquuto Doma

Mosquuto Doma

ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ పూణె నిర్వహించిన అధ్యయనంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో జికా వైరస్‌ ఉన్నట్లు తేలింది. జికా దోమలు కుట్టడం వల్ల వస్తుంది. తలనొప్పి, జ్వరం, దద్దుర్లు, కీళ్ల మరియు కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. గత ఏడాది కేరళలో 66 జికా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవలి అధ్యయనం ప్రకారం, జికా వైరస్ వ్యాప్తి అనేక రాష్ట్రాల్లో కనుగొనబడింది. దానిపై నిఘాను పటిష్టం చేయాలని కేంద్రం పేర్కొంది. జార్ఖండ్, ఢిల్లీ, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో జికా వైరస్ ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది.